Purvanchal Expressway: రహదారిపై యుద్ధ విమానం ల్యాండింగ్.. మోదీ ధైర్యానికి 'దేశం' సలాం
ఉత్తర్ప్రదేశ్ సుల్తాన్పుర్లో పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App340.8 కిలోమీటర్ల పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే లఖ్నవూ-సుల్తాన్పూర్ హైవేలోని చాంద్సరాయ్ గ్రామం నుంచి ప్రారంభమవుతుంది.
బారాబంకి, అమేథీ, సుల్తాన్పూర్, ఫైజాబాద్, అంబేద్కర్ నగర్, ఆజంఘర్, మవూ ప్రాంతాలను కలుపుతూ చివరకు గాజీపుర్ జిల్లాలోని హల్దారియా వద్ద ముగుస్తుంది.
అంతకుముందు సీ-130జే యుద్ధ విమానంలో రహదారిపైనే ల్యాండ్ అయి.. వినూత్నంగా కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ హైవే మధ్యలో సుల్తాన్పూర్ దగ్గర యుద్ధ విమానాలు దిగేందుకు వీలుగా దాదాపు మూడు కిలోమీటర్ల రన్వే ఏర్పాటు చేశారు.
అత్యవసర సమయాల్లో రహదారులపైనే యుద్ధవిమానాలు దిగేందుకు వీలుగా జాతీయ రహదారులను రూపొందించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
ఇందులో భాగంగానే రూ.22,500 కోట్ల వ్యయంతో పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేను నిర్మించింది.
వాహనదారులకు ప్రయోజనం కలిగేలా, ఇంధన వాడకం తగ్గేలా ఈ రహదారిని నిర్మించారు.
భవిష్యత్లో దీన్ని ఎనిమిది వరుసల రహదారిగా మార్చుకోవచ్చు.