In PICS: కోట్లాది రూపాయలు కాదని కోరుకున్నవాడ్ని పెళ్లాడిన జపాన్ రాకుమారి
ABP Desam
Updated at:
26 Oct 2021 06:58 PM (IST)
1
రాచరికాన్ని, కోట్లాది రూపాయలను వదులుకుని ఓ సామాన్యుడిని పెళ్లాడింది జపాన్ రాకుమారి మకో
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
మూడేళ్ల నిరీక్షణ తర్వాత జపాన్ రాకుమారి మకో ఎట్టకేలకు తన ప్రేమను గెలిపించుకుని ప్రియుడు కీ కొమురోతో వివాహబంధంలోకి అడుగుపెట్టింది.
3
మకో - కిమురోల వివాహాన్ని టోక్యో ఇంపీరియల్ ప్యాలెస్ అధికారికంగా ధ్రువీకరించింది.
4
ఇంటి నుంచి బయటకొచ్చే ముందు మకో.. తన తల్లిదండ్రులను, సోదరిని హత్తుకుని ఒకింత భావోద్వేగానికి గురైంది.
5
జపాన్ చక్రవర్తి నరుహిటో తమ్ముడు అకిషినో కుమార్తో అయిన మకో.. టోక్యో ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్శిటీలో చదువుకుంది.
6
అక్కడే తనతో పాటు చదువుకునే సామాన్యుడు కొమురోను ఇష్టపడింది.
7
2017లోనే ఈ జంట తాము ప్రేమపెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పటికి అయింది.