ఢిల్లీని కమ్ముకున్న కాలుష్య మేఘాలు
ఢిల్లీలో కాలుష్యం రోజురోజుకీ ప్రమాదకరంగా మారుతోంది. ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయింది. (Image Credits: ANI)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవీలైనంత వరకూ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ప్రభుత్వం సూచించింది. తద్వారా వెహికిల్స్ నుంచి వచ్చే కాలుష్యం కొంతైనా తగ్గుతుందని భావిస్తోంది. (Image Credits: ANI)
దుమ్ము, ధూళి రేణువులు గాల్లోనే ఉండిపోవటం వల్ల రోడ్లు సరిగా కనిపించటం లేదు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావడం లేదు. (Image Credits: ANI)
పగలు కూడా వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని అతికష్టం మీద ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఒక్కోసారి ఇలా ప్రమాదాలూ జరుగుతున్నాయి. (Image Credits: ANI)
ఈ కాలుష్యం కారణంగా పచ్చని చెట్లన్నీ నాశనమవుతున్నాయి. వాటిపై దుమ్ము, ధూళి సోకి ఎండిపోతున్నాయి. పచ్చదనం లేక ఢిల్లీలో స్వచ్ఛమైన గాలే కరవైంది. (Image Credits: ANI)
పంజాబ్లో రైతులు గడ్డిని కాల్చడం వల్ల ఢిల్లీలో కాలుష్యస్థాయి తీవ్రమవుతోంది. ఈ పొగలు గాల్లో కమ్ముకుని ఢిల్లీ, హరియాణా వాతావరణాన్ని విషతుల్యం చేస్తున్నాయి. (Image Credits: ANI)
ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. ఫలితంగా ఏటా అక్టోబర్ రాగానే ఢిల్లీ ఇలా ఉక్కిరిబిక్కిరవుతోంది. (Image Credits: ANI)
ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో అత్యవసర నిర్మాణాలు తప్ప మిగతా అన్నింటిపైనా నిషేధం విధించారు. వీలైనంత వరకూ వాహనాల సంఖ్యనూ తగ్గించే ప్రయత్నాలూ చేస్తున్నారు. (Image Credits: ANI)
ఢిల్లీలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. (Image Credits: Twitter)