Ram Mandir: మత కలహాల నుంచి మందిర నిర్మాణం వరకూ - అయోధ్య వివాదానికి వందల ఏళ్ల చరిత్ర
1528లో రాముడి జన్మస్థలంగా హిందువులు నమ్మే ప్రాంతంలో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ మసీదు నిర్మించాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App1853లో ఈ స్థలం గుర్తింపు విషయంలో మొదటి హిందూ-ముస్లిం ఘర్షణ జరిగింది. 1855-1859 మధ్య కాలంలో స్థలంపై నియంత్రణకు సంబంధించి చట్టపరమైన వివాదం తలెత్తింది. చివరికి హిందువులు, ముస్లింలు ఇద్దరికీ ప్రవేశాన్ని కల్పించేలా రాజీ మార్గంలో సమస్యకు పరిష్కారం లభించింది. 1885లో మసీదు వెలుపల ఉన్న రామ్ చబుత్రాపై గోపురం నిర్మించాలని ఫైజాబాద్ జిల్లా కోర్టులో మహంత్ రఘుబీర్ దాస్ పిటిషన్ వేశారు. అది తిరస్కరణకు గురైంది. 1949లో రాముడు, సీత విగ్రహాలు మసీదు లోపల రహస్యంగా ఉంచారన్న ప్రచారం ఉద్రిక్తతలకు దారి తీసింది. 1950-1959 మధ్య కాలంలో అక్కడ భూమి అప్పగించాలని పూజలు నిర్వహించాలని కోరుతూ హిందూ సంఘాలు కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ వచ్చాయి.
1962: మసీదు తమదేనంటూ ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు ప్రకటించింది.
1984: ఆ ప్రదేశంలో పూజలు చేసుకోవడానికి హిందువులకు అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ అనుమతించారు. దీంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
1985-86లో అయోధ్యలోని 'వివాదాస్పద' స్థలంలో రామమందిరాన్ని నిర్మించాలని కోరుతూ VHP ఉద్యమాన్ని ప్రారంభించింది.
1990: BJP నాయకుడు ఎల్కే అద్వానీ దేశవ్యాప్తంగా రథయాత్ర ప్రారంభించారు. కానీ దీన్ని బిహార్లో ఆపిసి ఆయన్ని అరెస్టు చేసింది అప్పటి ప్రభుత్వం.
1992లో బాబ్రీ మసీదుపై కరసేవకులు దాడి చేసి కూల్చివేశారు. ఇది దేశవ్యాప్తంగా మత హింసకు కారణమైంది.
1994: బాబ్రీ మసీదు కూల్చివేతపై దర్యాప్తు చేసేందుకు లిబర్హాన్ కమిషన్ను అప్పటి ప్రభుత్వం నియమించింది.
2002: గుజరాత్లో వేల మంది హిందువులు, ముస్లింల మరణానికి మతపరమైన హింస దారితీసింది.
2002లో వివాదాస్పద భూమికి సంబంధించిన వ్యాజ్యాల విచారణను అలహాబాద్ హైకోర్టు ప్రారంభించింది. 2003లో భారత పురావస్తు శాఖ ఆ ప్రదేశంలో తవ్వకాలను నిర్వహించింది, మసీదు కింద హిందూ నిర్మాణాలు ఉన్నట్లు ఆధారాలు గుర్తించింది. 2010లో వివాదాస్పద భూమిని మూడు భాగాలుగా విభజించి, సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, హిందూ మహాసభ ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్ లల్లాకు కేటాయించాలని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. 2011-2019 మధ్య కాలంలో అలహాబాద్ హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా చాలా సంఘాలు సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశాయి.
2019లో వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణం కోసం ట్రస్టుకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
2020లో భూమి పూజ కార్యక్రమంతో రామ మందిర నిర్మాణం ప్రారంభమైంది.
2024లో అంటే ఈ ఏడాది జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవం.