Walking on Grass : గడ్డి మీద చెప్పులు లేకుండా నడిస్తే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా? రోజూ కాసేపు నడిచేయండి

రోజూ వాక్ చేసే అలవాటు ఉంటే.. మీరు దానిలో కాసేపు గడ్డిపై నడవడానికి ఆసక్తిని చూపండి. ఎందుకంటే పాదాలకు చెప్పులు లేకుండా గడ్డిమీద నడిస్తే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
గడ్డి మీద చెప్పులు లేకుండా నడిస్తే అది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది మానసిక ప్రశాంతతను అందించి.. నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

మీకు కీళ్ల సమస్యలుంటే.. గడ్డి మీద రోజూ నడిస్తే మంచి ఫలితాలుంటాయి. ఇలా చేయడం వల్ల కీళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. ఇది మోకాళ్లు, చీలమండలలో నొప్పిని తగ్గిస్తుంది.
మానసిక ఒత్తిడిని తగ్గించి.. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ ఉంటుంది. దీనివల్ల శరీరానికి ఆక్సిజన్ సరఫరా అందుతుంది.
చెప్పులు లేకుండా గడ్డిపై నడిస్తే ఆక్యుప్రెషర్ ప్రభావం ఉంటుంది. ఇది శరీరంలో శక్తిని పెంచి.. యాక్టివ్గా ఉండేలా చేస్తుంది. కంటి చూపునకు కూడా ఇది మంచిదట.
గడ్డి మీద నడిస్తే ప్రకృతితో అనుబంధం ఏర్పడుతుంది. పాదాలకు సహజమైన మసాజ్ అందుతుంది. హ్యాపీగా ఉంటారు.
రోజూ గడ్డి మీద 30 నిమిషాలు నడిస్తే.. దాదాపు 120 నుంచి 150 కేలరీలు బర్న్ అవుతాయి. బరువు తగ్గుతూ, మానసిక ప్రశాంతత కోసం ఎదురు చూసేవారు దీనిని ఫాలో అవ్వొచ్చు.
ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి.