Pancreatic Cancer : ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలు ఇవే.. కాళ్లలో కనిపించే ఈ సంకేతాలు విస్మరించకండి
పాంక్రియాటిక్ క్యాన్సర్ వలన డీప్ వెయిన్ త్రాంబోసిస్ వచ్చే ప్రమాదం ఉంది. దీనిలో కాళ్లు లేదా పెల్విస్లోని లోతైన సిరల్లో రక్తం గడ్డకడుతుంది. దీనివల్ల కాలు నొప్పి, వాపు, ఎరుపు వంటి సమస్యలు వస్తాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకొన్నిసార్లు ప్రభావిత ప్రాంతం చర్మం సాధారణం కంటే వేడిగా మారుతుంది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం.. చాలా మంది రోగులలో కనిపించే క్యాన్సర్ మొదటి సంకేతం ఇది.
రక్తం గడ్డ కట్టి ఊపిరితిత్తులకు చేరితే.. అది పల్మనరీ ఎంబాలిజంగా మారుతుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి వస్తుంది. ఇది ప్రాణాంతక పరిస్థితి. వెంటనే చికిత్స తీసుకోకుంటే చనిపోయే ప్రమాదం ఉంది.
కీమోథెరపీ, శస్త్రచికిత్స తర్వాత తక్కువ కదలికల వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నారు.
క్యాన్సర్‌తో పాటు జన్యుపరమైన పరిస్థితులు, హార్మోన్ థెరపీ, గర్భనిరోధక మాత్రలు, వెరికోజ్ సిరలు, ఊబకాయం, ధూమపానం, వృద్ధాప్యం వంటివి రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతాయి.
అవి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ప్యాంక్రియాస్ కణాలు నియంత్రణ లేకుండా పెరిగి.. కణితులు ఏర్పడుయి. ప్రారంభ దశలో ఇది స్కానింగ్‌లో కనిపించదు. కానీ మందులతో పెరగకుండా కంట్రోల్ చేయవచ్చు.
కామెర్లు, ముదురు రంగు మూత్రం, లేత రంగు మలం, పొత్తికడుపు లేదా వెన్ను నొప్పి, అలసట, చర్మం దురద, వికారం, ఉబ్బరం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, మధుమేహం వంటి లక్షణాలు కనిపిస్తాయి.