Morning Habits : నిద్రలేవగానే ఆ తప్పులు చేయకండి.. వీటిని చేస్తే ఆరోగ్యానికి, మనసుకు చాలా మంచిది
ఉదయాన్నే నిద్రలేవడం వల్ల మీ రోజును బాగా ప్లాన్ చేసుకోవచ్చు. స్నూజ్ చేయడం మీ నిద్ర విధానానికి ఆటంకం కలుగుతుందని గుర్తుంచుకోండి. కాబట్టి అలారం ఆపకుండా.. ఎక్కువ సమయం నిద్రపోకుండా కొంచెం ముందుగా నిద్ర లేవడానికి ప్రయత్నించండి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎక్కువ సమయం పడుకున్న తరువాత శరీరం డీహైడ్రేషన్‌కు గురి అవుతుంది. కాబట్టి నిద్రలేవగానే.. మొదటిగా ఒక గ్లాసు నీరు తాగండి. ఇది మీ జీవక్రియను మెరుగుపరచవచ్చు. ఇది శరీరాన్ని రిఫ్రెష్ చేయవచ్చు. నిమ్మ, తేనె కలిపి కూడా తీసుకోవచ్చు.
ఉదయాన్నే డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ.. ధ్యానం చేస్తే మనసుకు రిలాక్స్‌గా ఉంటుంది. వర్క్‌పై ఫోకస్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఇవి మీ మానసిక స్థితిని మెరుగుపరుచుకునేలా చేస్తాయి.
యోగా, వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఎండార్ఫిన్‌లు విడుదలవుతాయి. మీ శక్తి పెరుగుతుంది. క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం వల్ల మానసికంగా చురుకుంగా ఉంటారు.
సమతుల్య అల్పాహారం తీసుకోవడం వల్ల మీ శరీరానికి రోజును ప్రారంభించడానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఉండేలా చూసుకుంటే మంచిది.
నిద్ర లేచాక మీరు కచ్చితంగా చేయాల్సిన ఇంపార్టెంట్ పనులు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. వాటిని రాసుకుంటే మరీ మంచింది. దీనివల్ల వాయిదా వేయకుండా ఉండగలుగుతారు.
నిద్ర లేవగానే సోషల్ మీడియా లేదా ఈమెయిల్స్ చూడడం, ఫోన్ చెక్ చేసే అలవాటు ఉంటే మానుకోండి. దీనివల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.