Condoms Ban: ఈ దేశాలలో కండోమ్‌ల వాడకంపై నిషేధం, అవి కొనడం కూడా పాపమే
ఈ జాబితాలో మొదటి పేరు ఆఫ్ఘనిస్తాన్. అక్కడ ఉన్నది తాలిబాన్ ప్రభుత్వం. తాలిబాన్ ప్రభుత్వం దేశంలో కండోమ్‌లను నిషేధించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో కండోమ్స్ అమ్మడం చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆఫ్ఘనిస్తాన్‌లో కండోమ్ వాడకంపై నిషేధం విధించారు. కండోమ్స్ అమ్మవద్దని దుకాణదారులకు సైతం కఠిన హెచ్చరికలు జారీ చేశారు. కండోమ్ ల వాడకం ఇస్లామిక్ విలువలకు వ్యతిరేకం అని అక్కడ ప్రభుత్వం భావిస్తోంది.
ఆఫ్ఘనిస్తాన్ తరువాత కండోమ్స్‌ను పూర్తి స్థాయిలో నిషేధించిన దేశం ఇండోనేషియా. కండోమ్‌ల వాడకం వల్ల వ్యభిచారం చేయడం, అనైతిక సంబంధాలు పెరుగుతాయని ఇక్కడి ప్రభుత్వం పేర్కొంది. అందుకే దేశంలో కండోమ్‌లపై నిషేధం విధించారు.
నైజీరియాలో కండోమ్‌ల విక్రయాలు, వాడకం అనేది చట్టవిరుద్ధం. అక్కడ లభించే కండోమ్స్ నాసిరకంగా ఉంటాయి. అందుకే ఇక్కడ ప్రజలు వాటిని వాడేందుకు అంతగా ఇష్టపడరు. అక్కడ సురక్షిత లైంగిక సంబంధాల గురించి అవగాహన తక్కువగా ఉంది.
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ దేశ జనాభాను పెంచాలని భావిస్తున్నారు. అందుకే ఇక్కడ కండోమ్ ఉత్పత్తితో పాటు వినియోగంపై సైతం నిషేధం విధించారు. కండోమ్‌ల వాడకం దేశ జనాభా పెంపు విధానానికి వ్యతిరేకం అని కిమ్ ప్రభుత్వం భావిస్తోంది.
ఫిలిప్పీన్స్ లో కాథలిక్ చర్చి ప్రభావం అధికంగా ఉంది. చర్చి ప్రకారం కండోమ్స్ వాడకం అనేది ప్రకృతి నియమాలకు, మతపరమైన ఆలోచనలకు వ్యతిరేకం. అందుకే ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఇక్కడ కండోమ్స్ వాడకంపై నిషేధం విధించింది.
జాంబియా ప్రభుత్వం క్రైస్తవ మతానికి బాగా ప్రభావితమైంది. అందుకే ఈ దేశంలో కండోమ్‌ల వాడకాన్ని తప్పుగా భావిస్తారు. బలహీనమైన నైతికతకు గుర్తుగా కండోమ్స్ వినియోగాన్ని పరిగణిస్తారు.