Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Pod Rooms in Mumbai: జపాన్ ‘క్యాప్సూల్స్’ తరహాలో ‘పాడ్ రూమ్స్’.. తొలిసారి ఇండియాలో!
ఈ చిత్రాన్ని చూడగానే.. ఇదేంటీ జపాన్‌లోని పాడ్ హోటల్ గదుల్లా ఉన్నాయే.. అని అనుకుంటున్నారా? అది నిజమే. కానీ, ఇది జపాన్‌లో కాదు.. ఇండియాలోనే. - Image Credit: Ministry of Railways
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఔనండి, మన భారతీయ రైల్వేస్.. ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల కోసం సరికొత్త ‘పాడ్ రూమ్స్’ను నిర్మించింది. - Image Credit: Ministry of Railways
రైల్వే, బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి రావు సాహెబ్ పాటిల్ దాన్వే నవంబర్ 17న ఈ పాడ్ రూమ్స్‌ను ప్రారంభించారు. - Image Credit: Ministry of Railways
ముంబై సెంట్రల్ స్టేషన్‌లోని మొదటి అంతస్తులో ‘అర్బన్ పాడ్ రూమ్’ పేరుతో రైల్వే ఈ హోటల్‌ను నిర్మించింది. - Image Credit: Ministry of Railways
తాజాగా రైల్వే మంత్రి ట్వి్ట్టర్ ద్వారా పాడ్ రూమ్స్ ఫొటోలను షేర్ చేశారు. అంతే.. అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. - Image Credit: Ministry of Railways
సాధారణంగా ఇలాంటి గదులు జపాన్‌లోనే కనిపిస్తాయి. వీటిని పాడ్ రూమ్ లేదా క్యాప్సూల్స్ అని పిలుస్తారు. - Image Credit: Ministry of Railways
ఎందుకంటే.. ఈ హోటల్ గదులు ఒక మనిషి మాత్రమే నిద్రపోయేందుకు వీలుగా ఉంటుంది. - Image Credit: Ministry of Railways
ఈ పాడ్స్‌లో టీవీతోపాటు ఏసీ, రీడింగ్ లైట్స్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్ వంటి సదుపాయాలు కూడా ఉంటాయి. - Image Credit: Ministry of Railways
రైల్వే ప్రయాణికులు విశ్రాంతి తీసుకొనేందుకు ఈ పాడ్స్ చాలా సౌకర్యంగా ఉంటాయి. మీరు కూడా ఇందులో విశ్రాంతి తీసుకోవాలంటే 12 గంటలకు రూ.999, 24 గంటలకు 1,999 చొప్పున ఛార్జీలను చెల్లించాలి. ఇది విజయవంతమైతే.. త్వరలోనే మరికొన్ని ప్రధాన నగరాల్లో ఈ పాడ్ రూమ్స్ ఏర్పాటు చేస్తారట. - Image Credit: Ministry of Railways