Guava Health Benefits : రోజూ జామపండు తింటే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
జామపండులో ఫైబర్, ఫోలేట్, విటమిన్ ఎ, సిలు ఉంటాయి. పొటాషియం, ఐరన్, మాంగనీస్ వంటి పోషకాలతో నిండి ఉంటుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. కంటి ఆరోగ్యానికి కూడా ఇది మంచిదని చెప్తారు.
జామపండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. పలురకాలు ఆరోగ్య సమస్యలు దరిచేరవు.
జామపండులో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.
మధుమేహ సమస్యలున్నవారు కూడా జామపండును డైట్లో చేర్చుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను ఇది కంట్రోల్ చేస్తుంది.
జామపండులోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. బీపీని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయి.
జామపండును స్మూతీగా, సలాడ్స్లో తీసుకోవచ్చు. లేదంటే నేరుగా కూడా దీనిని డైట్లో చేర్చుకోవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. (Image Source : Envato)