Healthy Morning Drinks : పరగడుపునే వీటిని తాగితే ఆ ఆరోగ్య సమస్యలు దూరం.. కడుపు ఉబ్బరం, మలబద్ధకంతో పాటు మరెన్నో
ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం, తేనె కలిపిన గోరువెచ్చని నీటిని తాగవచ్చు. ఇది శరీరం నుంచి టాక్సిన్లను బయటకు పంపడంలో హెల్ప్ చేస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. విటమిన్ సి అందుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది.
జీలకర్రను రాత్రి నానబెట్టి ఆ నీటిని ఉదయం తాగడం లేదా జీలకర్రను నీటిలో వేసి మరిగించి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది.
మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తాగవచ్చు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి. హార్మోన్ల అసమతుల్యత సరిచేస్తుంది.
గ్రీన్ టీ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అయితే దీనిని బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకుంటే మరీ మంచిది. ఖాళీ కడుపుతో తీసుకుంటే కొందరికి తలనొప్పి వచ్చే అవకాశముంది.
ఉసిరికాయ రసంలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని సరిచేస్తుంది. స్కిన్, హెయిర్ హెల్త్ని కూడా మెరుగుపరుస్తుంది.
వేడి నీటిలో తురమిన అల్లం వేసి మరిగించి వడకట్టి తేనెను కలుపుకొని కూడా తాగవచ్చు. ఇది జీర్ణ సమస్యలను దూరం చేసి.. పీరియడ్స్ సయమం వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. (Image Source : Envato)