Gallbladder Pain : పిత్తాశయ నొప్పిని పెంచే 7 ఫుడ్స్ ఇవే.. వాటిని తినడం మానేస్తే మంచిదంటోన్న నిపుణులు
చీజ్ సమోసా, పకోడి, కచోరీ, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ఫుడ్స్ గాల్ బ్లాడర్ నొప్పిని ట్రిగర్ చేస్తాయి. డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఫుడ్ పిత్తాశయ నొప్పిని పెంచుతాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపాల ఉత్పత్తులైన వెన్న, క్రీమ్, చీజ్, ఫుల్ క్రీమ్ పాలు కూడా పిత్తాశయ సమస్యలను పెంచుతాయి. వీటిలో ఉండే సంతృప్త కొవ్వు జీర్ణక్రియను కష్టతరం చేస్తుంది. దీనివల్ల నొప్పి పెరుగుతుంది.
మటన్, బీఫ్ వంటి రెడ్ మీట్‌ను జీర్ణం చేయడానికి గాల్ బ్లాడర్ ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఇందులో అధిక కొలెస్ట్రాల్, కొవ్వు ఉంటుంది. ఇది రాళ్లు, నొప్పి ప్రమాదాన్ని పెంచుతుంది.
బర్గర్లు, పిజ్జాలు, ప్యాకెట్ స్నాక్స్, బేకరీ వస్తువులలో దాగి ఉన్న కొవ్వు గాల్‌బ్లాడర్ నొప్పిని పెంచుతుంది. ఇది ఊబకాయం, మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది.
కేక్, మిఠాయిలు, డోనట్స్, స్వీట్ డ్రింక్స్ పిత్తాశయ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి.. నొప్పిని కలిగిస్తాయి.
ఆల్కహాల్ కూడా లివర్, గాల్‌బ్లాడర్ రెండింటిపైనా ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది వాపును పెంచుతుంది. గాల్‌బ్లాడర్ నొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది.
ఘాటైన, ఎక్కువ మసాలా కలిగిన ఆహారం పిత్తాశయాన్ని పాడు చేస్తుంది. ఇది కడుపులో మంట, ఉబ్బరం, నొప్పి సమస్యలను వేగంగా పెంచుతుంది.