హైదరాబాద్‌కు దగ్గరలోని అందమైన పూలవనం ఇది, మిస్ అవ్వకుండా చూడండి
ఓ వీకెండ్ కవర్ అయ్యేలా హైదరాబాద్ నుంచి వెళ్లి మంచి ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిద్దాం అనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే... పైగా ఇది సీజన్ కూడా...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహిమాలయాల్లోని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ గురించి వినుంటాం. మంచులోయల్లో వికసించే రంగు రంగుల పుష్పాలు మైమరుపు కల్పిస్తాయి.
అంత దూరం వెళ్లలేం అనుకుంటున్నారా... అయితే ఆ స్థాయిలో కాకపోయినా అద్బుత అందాలను వెదజల్లే మరో పూలవనం కూడా ఉంది. మహరాష్ట్రలోని కాస్ పీఠభూమి Kaas Plateau/ Pathar గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి.
700 రకాల పూల జాతులు ఆ కొండప్రాంతాన్ని రంగలమయం చేస్తాయి. ఆగస్టు రెండో వారం నుంచి సెప్టెంబర్ చివరి వారం వరకూ ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు అనువైన సమయం.
వందల ఎకరాల్లో విస్తరించిన లోయలు, వాలుల్లో ఈ కొండపూలు అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి. సహ్యాద్రి పశ్చిమ కనుమల్లో అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఈ పీఠభూమి ఏర్పడింది. ఇది UNESCO World Heritage Sites లో ఒకటి.
సహజసిద్ధంగా ఏర్పడ్డ ప్రపంచంలోని అతిపెద్ద సైట్ లలో ఇది కూడా ఒకటి. ఇది మహరాష్ట్రలోని సతారా జిల్లాలో ఉంది. పూనే నగరానికి కూడా దగ్గరే.
హైదరాబాద్ నుంచి 540 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతం కావడం వల్ల ఎక్కువ మంది పర్యాటకులను అనుమతించరు.
రోజుకు కేవలం 3వేల మందిని మాత్రమే అనుమతిస్తారు.. దీనికోసం ముందుగా అటవీశాఖకు దరఖాస్తు చేసుకోవాలి. . https://www.kas.ind.in/index.php వైబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఎప్పుడూ వెళ్లే బీచులు, గుళ్లూ గోపురాలు, సిటీ షాపింగ్ వంటివి కాకుండా ప్రకృతిని ఆస్వాదించాలి..
అందులోనూ అరుదైన దృశ్యాలను చూడాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. ప్రకృతి ప్రేమికులందరూ దీనిని కచ్చితంగా చూడాలి.
ఎందుకంటే ఏడాదిలో కేవలం ఓ 40 రోజులు మాత్రమే ఈ సందర సమనోహరమైన దృశ్యాలను చూసే వీలుంటుంది.
పైగా తక్కువ మందికే ప్రవశం కాబట్టి.. మీకు అనుమతి వస్తే.. అదో ప్రత్యేకమైన ప్రివిలేజ్ అవుతుంది. అన్నింటికి మించి అద్బుతమైన దశ్యాన్ని మనసులో ముద్రించుకునే అవకాశం ఉంటుంది.
అన్నింటికి మించి అద్బుతమైన దశ్యాన్ని మనసులో ముద్రించుకునే అవకాశం ఉంటుంది
మరింకెందుకు ఆలస్యం... బుకింగ్ మొదలుపెట్టండి. ఆ తర్వాత ఆ పూలవనం చూడాలంటే.. ఇంకో ఏడాది ఆగాలి.
(All Photo credits: Wikipedia & Jayasri Abbineni & kas.ind.in)