RRB NTPC Exams: రైల్వే నాన్ టెక్నికల్ పరీక్ష తేదీలు విడుదల..
RRB NTPC Exams 2021: రైల్వే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్టీపీసీ) 7వ విడత పరీక్ష తేదీలను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ఖరారు చేసింది. ఈ పరీక్షలను జూలై 23, 24, 26, 31వ తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరైల్వేలో దాదాపు 16 నెలల క్రితం నాన్ టెక్నికల్ కేటగిరీలో 35,281 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ 28 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ఆరు దశల్లో పరీక్షలను నిర్వహించింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా చివరి దశ పరీక్షలను వాయిదా వేసింది.
దాదాపు 2.78 లక్షల మంది అభ్యర్థులు చివరి దశ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. దేశవ్యాప్తంగా 76 నగరాల్లోని 260 కేంద్రాల్లో ఎన్టీపీసీ చివరి విడత పరీక్షలను నిర్వహించనున్నట్లు RRB తెలిపింది.
పరీక్ష నిర్వహణ తేదీకి నాలుగు రోజుల ముందు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడానికి వారి దరఖాస్తు సంఖ్య, పుట్టిన తేదీ వివరాలను ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది.
కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులంతా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని చెప్పింది.
పరీక్షలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా హెల్ప్ డెస్క్ ను సంప్రదించవచ్చని సూచించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (http://www.rrbcdg.gov.in/) వెబ్సైట్లో చూడవచ్చని వివరించింది.