Vidya Balan Photos: సిల్క్ శారీలో వెండితెర సిల్క్ మెరుపుల్
కెరీర్ ప్రారంభం నుంచి భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ..వాటికి న్యాయం చేస్తూ దూసుకుపోతోంది విద్యాబాలన్... ప్రతి పాత్రకు న్యాయం చేస్తూ. వయసుతో సంబంధం లేకుండా ఆమె చేసిన క్యారెక్టర్స్ విమర్శకులను మెప్పిస్తాయ్.
Download ABP Live App and Watch All Latest Videos
View In App16 ఏళ్లున్నప్పుడు... ఏక్తా కపూర్ షో ''హమ్ పాంచ్''లో రాధికాగా తన కెరీర్‌ని ప్రారంభించింది విద్యా. 2003లో బెంగాలీ నాటకం 'భలో తేకో'తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. (Image Credit: Vidya Balan/ Instagram)
'పరిణీత'తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ తొలిసినిమాకే ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత అత్యధిక వసూళ్లు చేసిన 'లగే రహో మున్నా భాయ్' లో హీరోయిన్ గా నటిచింది. ఆ తర్వాత హే బేబీ , కిస్మత్ కనెక్షన్ మంచి రిజల్ట్ ఇవ్వలేదు. (Image Credit: Vidya Balan/ Instagram)
'పా', 'ఇష్కియా','నో వన్ కిల్డ్ జెస్సికా' లో నటించింది. అయితే 2011లో వచ్చిన సిల్క్ స్మిత బయోపిక్ ''ది డర్టీ పిక్చర్'' తో విద్యా పేరు మారుమోగిపోయింది. (Image Credit: Vidya Balan/ Instagram)
ప్రముఖ నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ని 2012లో వివాహం చేసుకున్న విద్యా... సాధారణంగా ప్రతి మగవాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందంటారు కానీ తన విజయం వెనుక సిద్ధార్థ్ ఉన్నాడంటూ గర్వంగా చెప్పుకుంటుంది. (Image Credit: Vidya Balan/ Instagram)
విద్యా బాలన్‌కి చీరలంటే చాలా ఇష్టం. సినిమాల్లో ఎలాంటి డ్రస్‌లు వేసినా.. బయట మాత్రం ఎప్పుడూ చీరల్లో నిండుగా కనిపిస్తూ ఉంటుంది విద్యా. ఆమె చీరకట్టుకు ఎంతోమంది అభిమానులున్నారు. (Image Credit: Vidya Balan/ Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విద్యాబాలన్..లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. (Image Credit: Vidya Balan/ Instagram)
విద్యాబాలన్ (Image Credit: Vidya Balan/ Instagram)
విద్యాబాలన్ (Image Credit: Vidya Balan/ Instagram)