Vishnupriya Bhimeneni: దూపం వేసి మరి సెగలు పుట్టిస్తోన్న విష్ణు ప్రియ - ఈ ఫొటోలు చూస్తే కుర్రాళ్లు ఏమైపోతారో!
యాంకర్ విష్ణు ప్రియ.. ఈ పేరు వింటేనే కుర్రాళ్ల గుండెల్లో ఏదో అలజడి మొదలవుతుంది. కళ్లల్లో మెరుపులు.. మనసులో కల్లోలం కామన్. ఎందుకంటే.. ఆమె అందాల ఆరబోత ఆ స్థాయిలో ఉంటుంది. తాజాగా విష్ణు ప్రియ షాకింగ్ ఫొటోలను పోస్ట్ చేసింది. అందులో ఆమె సాంబ్రాణితో దూపం వేస్తూ కనిపించింది. అంతేకాదండోయ్.. తన అందాలను ప్రదర్శిస్తూ సెగలు పుట్టిస్తోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈటీవీ ప్లస్‌లో ప్రసారమైన ‘పోవే-పోర’ కార్యక్రమంతో మంచి పాపులారిటీ సంపాదించింది విష్ణు ప్రియ.
కరోనా వల్ల అప్పట్లో ‘పోవే - పోరా’ షోకు పుల్‌స్టాప్ పడింది. ఆ తర్వాత మళ్లీ దాన్ని కొనసాగించలేదు. ఆ తర్వాత విష్ణు ప్రియకు అవకాశాలు రాలేదు.
విష్ణు ప్రియ బుల్లితెరపై మాయమైనా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్‌గానే ఉంటోంది. అప్పుడప్పుడు గ్లామర్‌ను ఒలకబోస్తూ కుర్రాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.
మరోవైపు.. యూట్యూబ్‌లో స్పెషల్ సాంగ్ వీడియోస్ చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంది. డ్యాన్స్ కుమ్మేస్తోంది.
ప్రస్తుతమైతే విష్ణు ఖాళీగానే ఉంది. బరువు తగ్గించుకుని మళ్లీ అవకాశాలను అందిపుచ్చేందుకు కసరత్తులు చేస్తోంది.