Pallavi Ramisetty: ఒకప్పటి బుల్లితెర హీరోయిన్ పల్లవి రామిశెట్టి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
Pallavi Ramisetty Photos: పల్లవి రామిశెట్టి.. ప్రత్యేకంగా పరియం అవసరం లేని పేరు. అచ్చమైన తెలుగు అందం.. చూడగానే ఆకట్టుకునే కట్టు, బోట్టు.. ఇలా సంప్రదాయంగా కనిపిస్తూ బుల్లితెర ఆడియన్స్ దగ్గరైంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈటీవీ సీరియల్స్‌తో టీవీరంగంలోకి వచ్చిన పల్లవి.. తనదైన నటనతో ఏకంగా 'నంది' అవార్డు అందుకుంది. ఆమె లీడ్ రోల్లో వచ్చిన భార్యామణి సీరియల్ బుల్లితెరపై ఎంతో ఆదరణ పొందింది.
అలా బుల్లితెరపై భార్యామణి, ఆడదే ఆధారం, వసుంధర, మాటే మంత్రము, అత్తారింటికి దారేది సీరియల్స్ మంచి స్టార్ నటిగా మారింది.
చేతినిండా సీరియల్స్ కెరీర్లో ఫుల్ బిజీగా తన కెరీర్ సాగుతున్న క్రమంలోనే 2019లో దిలీప్ కుమార్‌ను పెళ్లి చేసుకున్ని వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది.
పెళ్లయిన రెండేళ్లకు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో సీరియల్స్ కాస్తా బ్రేక్ ఇచ్చినా పల్లవి ఇప్పుడ మళ్లీ స్టార్ మా సీరియల్‌తో రీఎంట్రీ ఇస్తుంది.
స్టార్ మాలో కొత్తగా ప్రసారం కానున్న 'ఇంటింటి రామయణం' సీరియల్లో ఆమె లీడ్ రోల్ పోషిస్తుంది. త్వరలోనే ఈ సీరియల్ బుల్లితెరపై సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే మరోవైపు పల్లవి సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. అందమైన చీరకట్టుతో ఫోటోలకు ఫోజులు ఇస్తూ అందమైన చీరలు, బ్లౌజ్‌లను పరిచయం చేస్తుంది.
తాజాగా మంగళగిర పట్టు చీరలో పల్లవి రామిశెట్టి తళుక్కున మెరిసింది. ఇందులో ఆమెను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.