Satyabhama Serial Today October 29th Highlights : సత్యకు షాక్ ఇచ్చిన మహదేవయ్య .. సంధ్యను టార్గెట్ చేసిన సంజయ్ - సత్యభామ అక్టోబరు 29 ఎపిసోడ్ హైలెట్స్!
హర్ష-నందిని సంతోషంగా ఉండడం చూసి ఓర్వలేక మైత్రి కావాలనే స్విమ్మింగ్ పూల్ లో దూకేస్తుంది. హర్ష తనని కాపాడి ఒడ్డుకి తీసుకొస్తాడు. CPR చేయమని ఎవరోచెబితే మైత్రి సంతోషిస్తుంది..కానీ నందిని ఎంట్రీ ఇస్తుంది. మైత్రిపై ఫైర్ అవుతుంది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరెయిన్ డ్యాన్స్ చేసి సత్య బయటకు వస్తుంటే అడ్డుపడిన సంజయ్..తన మనసులో కుట్రని బయటపెట్టేస్తాడు.నీ అందానికి ఫ్లాట్ అయిపోయాను. క్రిష్ అంటే నీకు అస్సలు నచ్చేవాడు కాదు ఇప్పుడు ఇష్టపడుతున్నావ్ కదా..నాపై కూడా నీ అభిప్రాయం మారుతుందేమో అంటాడు. ఎవ్వరికీ చెప్పను నువ్వు ఒప్పుకుంటే నా జీవితం ధన్యం అయిపోతుంది అంటాడు..
అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోతున్న సత్యని చేయిపట్టుకుంటాడు సంజయ్..సత్య లాగిపెట్టి కొట్టి వార్నింగ్ ఇస్తుంది. సంజయ్ ని వీధికుక్కతో పోల్చిన సత్య.. ఇక ఓపిక పట్టలేను ఇప్పుడే వెళ్లి క్రిష్ కి జరిగింది చెప్పేస్తాను అంటుంది.
i నందిని, హర్షలు కార్ల డ్రైవ్ చేస్తుంటే ఓ వ్యక్తి కావాలనే నందినికి డ్యాష్ ఇస్తాడు..వాళ్లపై హర్ష చేయి చేసుకుంటే హర్ష తిరిగి కొడతాడు. ఇంతలో నందిని క్రిష్ ని పిలుస్తుంది. క్రిష్ వాళ్లని చితక్కొడుతుంటే సత్య ఆపుతుంది.
వాళ్లు నందినిని ఏడిపించారనే చితక్కొట్టాడు..నా జోలికి వచ్చావంటే కాళ్లు చేతులు తీసేస్తాడని సంజయ్ కి వార్నింగ్ ఇస్తుంది.
సత్యని తన దారిలోకి తెచ్చుకునేందుకు సత్య చెల్లెలు సంధ్యని ఉపయోగించుకోవాలి అనుకుంటాడు సంజయ్.
ఇక నందిని, హర్ష ఓ చోట కూర్చుని జరిగింది తల్చుకుంటారు. మా ఆవిడపై చేయి వేస్తే ఎలా ఊరుకుంటాను అంటాడు. నాపై చాలా ప్రేమ ఉంది హర్ష నీకు అంటుంది నందిని. ఇదంతా చూసి మైత్రి ఫీలైపోతుంది.
సత్య అలిగిందేమో అనుకుని క్రిష్ వెళ్లి బతిమలాడుతాడు.. కావాలనే బతిమలాడించుకోవాలని ఫిక్సవుతుంది. ఆ తర్వాత అందరూ బయలుదేరుతారు.. తాను కారు డ్రైవ్ చేస్తాంటుంది సత్య..
క్రిష్ లేని టైమ్ చూసి తనపై అటాక్ జరిగినట్టు గాయపడినట్టు యాక్ట్ చేస్తాడు మహదేవయ్య. క్రిష్ అదంతా నిజమే అని నమ్మేసి బాధపడిపోతాడు. క్రిష్ వెళ్లిపోయిన తర్వాత నీ భర్త నా చేయిదాటిపోకుండా ఉండాలంటే ఇలాంటి డ్రామాలు తప్పవ్ అంటూ సత్యకి షాక్ ఇస్తాడు మహదేవయ్య...