Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Satyabhama Serial Today November 7th Highlights : క్రిష్ తో ఆడేసుకున్న సత్య ..భైరవికి రివర్స్ షాక్ - సత్యభామ నవంబరు 07 ఎపిసోడ్ హైలెట్స్!
భైరవిపై మహదేవయ్య సెటైర్స్ వేస్తాడు..అక్కడున్నవాళ్లంతా నవ్వుతారు. ఫీలైన భైరవి తినకుండా లేచి వెళ్లిపోతుంది..ఆ సత్యని వదలను అంటుంది...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆకలికి తట్టుకోలేరుకదా ఇప్పుడేం చేస్తారని పంకజం అడిగితే..పక్కనే ఉన్న కబోర్డ్ ఓపెన్ చేసి అందులో ఉన్న లడ్డూలు తీసుకుని తింటుంది.. బైరవి తిండి చూసి పంకజం ఆశ్చర్యపోతుంది
సత్య బెడ్ సర్దుతుంటే ఈ రోజు రొటీన్ గా కాకుండా వెరైటీగా ఏదైనా చేయాలనిపిస్తోంది అనుకుంటూ సత్యతో సేవలు చేయించుకోవాలని ఫిక్సవుతాడు. తల్లి కిందపడితే సత్య సేవలు చేసింది కదా..తను కూడా చేయించుకోవాలని కిందపడినట్టు యాక్షన్ చేస్తాడు
క్రిష్ కి నిజంగానే ఏమైనా జరిగిందేమో అని ఫీలైన సత్య..ఆ తర్వాత అదంతా నాటకం అని పసిగట్టేస్తుంది. వేడివేడి నీళ్లు తీసుకొచ్చి కాపడం పెడుతుంది..క్రిష్ అరుస్తుంటాడు. ఇంత వేడినీరు పెడతారా అని క్రిష్ అంటే..దొంగనాటకాలకు ఇలానే చేస్తారంటుంది సత్య..
సత్యపై రివెంజ్ తీర్చుకునేందుకు భైరవి ప్లాన్ చేస్తుంది. ఏం చేస్తున్నారు అమ్మగారు అని పంకజం అంటే.. మోటర్ దగ్గర స్వచ్ ఆన్ చేసేలా చేసి సత్యకు షాక్ కొట్టించాలని ప్లాన్ చేస్తుంది భైరవి..
జయమ్మకు కాఫీ ఇచ్చిన తర్వాత క్రిష్ కి కాఫీ ఇచ్చేందుకు వెళుతుంది సత్య. ముద్దు పెడితేనే నిద్ర లేస్తానని క్రిష్ అంటాడు.. బాగా చెడిపోయావ్ అంటుంది సత్య.
భైరవి చెప్పడంతో మోటర్ వేసేందుకు వెళుతుంది సత్య..కరెక్ట్ గా అప్పుడే కరెంట్ పోతుంది. భైరవి, పంకజం షాక్ అవుతారు. మోటర్ వేశాను కానీ ఆనవలేదని సత్య చెబుతుంది. వంటింట్లో కరెకంట్ ఉంది కానీ తన గదిలో కరెంట్ ఎందుకు లేదు అనుకుంటాడు క్రిష్.. ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది
సత్యభామ నవంబరు 08 ఎపిసోడ్ లో కరెంట్ లేదా చెక్ చేస్తాను ఉండు అంటూ స్విచ్ భైరవి ఆన్ చేసి షాక్ కి గురవుతుంది. అప్పుడు కూడా భైరవిని సత్య కాపాడుతుంది...