Satyabhama Serial Today November 27th Highlights :గంగ వెనుకున్నది తానే అని షాక్ ఇచ్చిన సత్య.. వాట్ నెక్స్ట్ మహదేవయ్య - సత్యభామ నవంబరు 27 ఎపిసోడ్ హైలెట్స్!
పరిస్థితి తీవ్రంగా మారుతోందని..గంగపై పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను వాళ్లే లెక్కలు తేలుస్తారు అంటాడు క్రిష్. గంగకు జనం అండ ఉంది ఇలాంటప్పుడు అనవసరంగా సమస్యలు తెచ్చిపెట్టుకోకూడదు. దీనికి పరిష్కారం DNA టెస్ట్ చేయించుకోవడమే అంటుంది సత్య.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారని అంటాడు. నువ్వు గంగకి సపోర్ట్ చేస్తున్నావా అంటే..నాకు గంగ, మావయ్య కాదు నువ్వు ముఖ్యం.. DNA టెస్ట్ చేయించుకుంటే మావయ్య ఇమేజ్ పెరుగుతుంది..బాపూ ఎమ్మెల్యే అయితే నీకు మంచి రోజులొస్తాయి అంటుంది.
కిచెన్లో కూర్చుని బాధపడుతున్న భైరవిని చూసి నీకూ నా పరిస్థితే వచ్చింది అత్తమ్మా.. మొదట్లో నీ లెక్క నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. నా మొగుడికి ఎవరి పోలీక వచ్చిందా ఎందుకిట్టా అచ్చోసిన అంబోతులెక్క తయారయ్యాడా ఆలోచించా..ఇప్పుడు అర్థమైంది మావయ్య పోలిక వచ్చింది అంటుంది. DNA రిపోర్ట్ వస్తే గంగ మావయ్య రూమ్ లోకి..మీరు నా రూమ్ లోకి అంటుంది.
ఇంతలో పంకజం వచ్చి మీ కోడలు చెప్పింది నిజమే అంటుంది..మీరు బిందె లెక్క ఉంటే ఆ గంగ గ్లాస్ లా ఉంది..మీరు జిమ్ లో చేరండని సలహా ఇస్తుంది. భైరవి ఫైర్ అవడంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది పంకజం..
గంగకి సపోర్ట్ పెరుగుతుంది..అక్కడకు వెళ్లిన క్రిష్..నా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు..వెళ్లిపో అమ్మా అంటాడు. అమ్మా అన్నావ్ చాలు అంటుంది గంగ.
ఎవరి బిడ్డనో తీసుకొచ్చి నీ బిడ్డ అంటున్నావ్ సిగ్గులేదా మహదేవయ్య అని నర్సింహ అంటాడు. మా బాపూ నాకోసం పచ్చబొట్టు వేసకున్నాడని క్రిష్ అంటే.. భవిష్యత్ లో సమస్య వస్తుందనే పచ్చబొట్టు వేయించుకున్నాడని అంటారు..
క్రిష్ ను గంగతో పంపించాలని అంతా డిమాండ్ చేస్తారు. చిన్నా గంగ కొడుకు అని తేలితే పంపిస్తా అంటాడు మహదేవయ్య. అందుకే క్రిష్ - గంగకి DNA టెస్ట్ చేయించమంటాడు. అయితే ముగ్గురం DNA టెస్ట్ చేయించుకుందాం అంటుంది గంగ.
అదే జరిగితే నా కుట్ర బయటపడుతుందని భయపడతాడు మహదేవయ్య. చుట్టూ ఉన్నవారంతా కూడా... మహేదేవయ్య కొడుకే కదా క్రిష్ ఆయన.. DNA టెస్ట్ చేయించుకుంటారు అంటారు. నా కండిషన్ కి ఒప్పుకోపోతే మళ్లీ ధర్నా చేస్తానంటుంది గంగ...
సత్యభామ నవంబరు 28 ఎపిసోడ్ లో మహదేవయ్య గంగపై ఫైర్ అవుతాడు..ఆమె వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలి అనుకుంటాడు. అది నేనే అని క్లారిటీ ఇస్తుంది సత్య... గంగని రెండో పెళ్లాంగా ఒప్పుకుంటారా లేదంటే క్రిష్ కొడుకు కాదని బయటపెడతారా డిసైడ్ చేసుకోండి అంటుంది..