Satyabhama Serial Today November 22nd Highlights : క్రిష్ కి మొత్తం అర్థమైపోయింది ఇక శివ తాండవమే - సత్యభామ నవంబరు 22 ఎపిసోడ్ హైలెట్స్!
క్రిష్, సత్య, జయమ్మలు చక్రవర్తి పుట్టిన రోజు ఘనంగా సెలబ్రేట్ చేయాలి అనుకుంటారు. మహదేవయ్యని పిలుద్దాం అంటే.. ఆయన మంచి నిద్రలో ఉన్నారు కదా అంటుంది సత్య. నీ కొడుకు సంజయ్ ఉంటే బావుండేదని జయమ్మ అంటే.. ఈ కొడుకు ఉన్నాడు కదా అంటుంది సత్య. నాన్న తర్వాత చిన్నాన్న అంటే నాన్నే కదా అంటుంది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబాబాయ్ ఓకే అంటే నాకు ఓకే అంటాడు క్రిష్. అంటున్నారా అని సత్య అడిగితే..చక్రీ ఏమోషన్ అవుతాడు. ఆ తర్వాత కేక్ కట్ చేస్తాడు..ముందు జయమ్మకి తినిపిస్తుంటే కొడుకు క్రిష్ కి పెట్టండి అంటుంది సత్య. మళ్లీ సంజయ్ ను తలుస్తుంది జయమ్మ.. అరె కొడుకుని నేనున్నా కదా అని క్రిష్ కేకు తినిపిస్తాడు. కొడుకుని హగ్ చేసుకుని మురిసిపోతాడు చక్రవర్తి
మైత్రి ఇంటినుంచి అర్థరాత్రికి ఇంటికి చేరుకుంటాడు. నందినికి సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తే.. కోపంగా కుండీ తన్నేసి వెళ్లిపోతుంది.
ఇంతలో శాంతమ్మ వచ్చి అది కాబట్టి కోపంగా వెళ్లింది..నేనైతే ఉతికేసేదాన్ని..పిచ్చిది సాయంత్రం నుంచి ఎదురుచూస్తూ కూర్చుంది. దానికి నీపై ఉన్న ఇష్టం నీ కళ్లకు కనబడుతోందా..ఇంకా నా ముందు ఎందుకు లోపలకి పో అంటుంది..
హర్ష రూమ్ లోకి వెళతాడు..నందిని నేను చెప్పేది విని అంటూ మైత్రి అంటాడు. మన మధ్య ఆ పేరు రాదని మాటిచ్చావ్ కనీసం ఆ మాట నిలబెట్టుకో అంటుంది
బర్త్ డే సెలబ్రేషన్స్ తలుచుకుని చక్రవర్తి చాలా ఆనందంగా ఉంటాడు. ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదంటాడు. క్రిష్ మీ కొడుకు అని లోకానికి చెబితే మీ జీవితం మొత్తం ఆనందమే అంటుంది. మీ ఇధ్దరూ దగ్గరయ్యేలా నేను చేస్తాను అంటుంది సత్య.
మరోవైపు క్రిష్ కూడా చక్రిని హగ్ చేసుకున్న సీన్ గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు.ఏమైందని సత్య అడిగితే.. ఏదో దక్కిన ఆనందం, అది నా నుంచి ఎప్పటికీ దూరం కాకూడదు అనిపిస్తోంది..అసలు కన్నీళ్లు ఎందుకు వస్తున్నాయో తెలియడం లేదంటాడు. బాబాయ్ కి నేనంటే ఇష్టం అని తెలుసు కానీ ఈ ప్రేమ కొత్తగా ఉందంటాడు.
గుడ్ న్యూస్ చెప్తావని అన్నావ్ చెప్పు సత్య అంటాడు క్రిష్..అప్పుడు సత్య గంగ అనే ఆమెకు కాల్ చేసి రేపు ఇంటికి రమ్మని ప్లాన్ అమలు చేయమని చెబుతుంది. దాంతో గంగ రేపు మీ మామ పని అయిపోతుంది నిజం ఎలా చెప్పిస్తానో చూడు అంటుంది. రేపు మీ పనైపోతుంది మావయ్య అనుకుంటుంది సత్య
తన ప్లాన్ లో భాగంగా సంధ్యను ఫాలో అవుతాడు సంజయ్.
భైరవి నీళ్లు తాగుతుంటే నీ భార్యను అడుగు..రోజంతా ఆమెతోనే తిరుగుతావ్ నేనెందుకు ఇవ్వాలి అంటుంది.. సత్యభామ నవంబరు 23 ఎపిసోడ్ లో భాగంగా గంగ ఎంట్రీ ఇస్తుంది..క్రిష్ నా కొడుకు అంటూ హడావుడి మొదలెడుతుంది..మరి మహదేవయ్య రియాక్షన్ ఏంటో చూడాలి..