Satyabhama Serial Today November 16th Highlights : క్రిష్ జన్మ రహస్యం బయటపెట్టిన సత్య .. సంజయ్ విషయంలో బయటపడిన మహదేవయ్య - సత్యభామ నవంబరు 16 ఎపిసోడ్ హైలెట్స్!
కిడ్నాపర్ల నుంచి తీసుకొచ్చిన మైత్రి దెబ్బలకు కట్లు కడతాడు హర్ష. ఆ తర్వాత తల్లిదండ్రులు హర్షని పిలిచి.. ఇక మైత్రిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం మంచిదని హితబోధ చేస్తారు. నష్టం హద్దులుదాటినప్పుడు నిర్ణయం తీసుకోకతప్పదంటారు..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమైత్రిని వెళ్లమని చెప్పలేను..వెళతానంటే ఆపలేను అంటాడు హర్ష. ఇదంతా విని మైత్రి రగిలిపోతుంది..నిర్ణయం నాకే వదిలేశాడు అన్నమాట అనుకుంటుంది
క్రిష్ తుపాకీ శుభ్రం చేస్తుంటే వచ్చి లాక్కుంటాడు సంజయ్. పొరపాటున ఫైర్ అయ్యేసరికి కంగారుపడతాడు. క్రిష్-సత్య నవ్వుతారు. మహదేవయ్య వచ్చి ఆరాతీయడంతో జరిగింది చెబుతారు. నువ్వెప్పుడూ తుపాకీ జోలికి పోవద్దంటాడు క్రిష్..చేతకానప్పుడు రివాల్వర్ తీసుకోవడం ఎందుకు అంటుంది సత్య..
అవమానంగా ఫీలైన సంజయ్ తాడో పేడో తేల్చుకుందాం.. భయం వాడికో నాకో తేలిపోవాలంటాడు. రివాల్వర్ లాక్కుని అందులో ఉన్న బుల్లెట్లు తీసేసి ఒక్కటి ఉంచుతాడు. ఒక్క బులెట్ ఆరు ఛాన్సులు..పేల్చుకుందాం..ఎవరికి భయమో అర్థమవుతుందని ఛాలెంజ్ చేస్తాడు...
మహదేవయ్య కంగారుపడిపోతాడు..నీకు పిచ్చిపట్టిందా ఏం గేమ్ ఇదంతా అని క్లాస్ వేస్తాడు. ఓడిపోతే ఓడిపోతావ్ వెనక్కు తగ్గు అంటాడు మహదేవయ్య..నీ కొడుకును ఓడిపొమ్మని చెబుతున్నావా అంటాడు క్రిష్. చక్రి వారించినా కూడా ఇద్దరూ వినరు.
గేమ్ ఆడేందుకు నేను రెడీ అంటాడు క్రిష్.. చక్రి-సత్య తలపట్టుకుంటారు. ఆ తర్వాత ఒకరి తర్వాత మరొకరు గన్ తీసి పేల్చుకుంటారు. గేమ్ ఆపండని మహదేవయ్య అంటే.. సత్య-క్రిష్ సారీ చెబితే ఆపేస్తానంటాడు సంజయ్. మహదేవయ్య చెప్పమన్నా కానీ క్రిష్ తగ్గడు..
లాస్ట్ ఛాన్స్ అని సంజయ్‌ని క్రిష్ కాల్చబోతే మహదేవయ్య గన్ లాక్కోవడంతో.. ప్రమాదం సంజయ్ కి మాత్రమే అంటావేంటి క్రిష్ కి కూడా అని అడ్డుపడతాడు చక్రీ. అసలు క్రిష్ గురించి కాకుండా సంజయ్ గురించి ఆలోచిస్తున్నావెందుకని క్వశ్చన్ చేస్తాడు.
పరాయి ఇంటికి వచ్చినప్పుడు బుద్ధిగా ఉండాలి కదా అంటాడు చక్రీ.. సంజయ్ కి ఇది పరాయి ఇల్లు ఎలా అవుతుందని ఫైర్ అవుతాడు మహదేవయ్య. మహదేవయ్య సంజయ్ గురించి...చక్రీ క్రిష్ గురించి గొడవపడతారు..సత్య ఆలోచనలో పడుతుంది..
సత్యభామ నవంబరు 18 సోమవారం ఎపిసోడ్ లో.... 2 కోట్లు కావాలంటాడు సంజయ్ వ్యాపారం కోసం..నో అంటాడు చక్రీ. క్రిష్ పై ఎందుకంత అభిమానం అని సత్య అడుగుతుంది.. అన్నీ తెలిసే అడుగుతున్నా బిడ్డల మార్పిడి గురించి చెప్పండి అంటుంది సత్య...