Satyabhama Serial Today November 12th Highlights : హాస్పిటల్ నుంచి మొదలైన సత్య అన్వేషణ...మహదేవయ్యకి కౌంట్ డౌన్ మొదలు - సత్యభామ నవంబరు 12 ఎపిసోడ్ హైలెట్స్!
మహదేవయ్య - చక్రవర్తి మాట్లాడుతుండగా అక్కడకు సత్యవస్తుంది.. చక్రవర్తి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. జరిగిన లొల్లి చూస్తుంటే అర్థంకాలేదా క్రిష్ ఎప్పుడూ నావైపే ఉంటాడు అంటాడు మహదేవయ్య.. క్రిష్ అసలు తండ్రి ఎవరో తెలుసుకుని మీకు చెక్ పెడతానని సవాల్ చేస్తుంది సత్య
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనీకు కావాల్సిన నిజాన్ని పాతిక అడుగులు లోతులో తవ్వేశానని మహదేవయ్య.. ఎక్కడ పాతిపెట్టారో అక్కడినుంచే కథ మొదలెడతా అంటుంది సత్య. నాతో సవాల్ చేయాలి అనుకున్నవారు జనాభా లెక్కల్లో లేరంటాడు. అదీ చూద్దాం అంటాడు మహదేవయ్య
మైత్రి వెళ్లిపోగానే ఇళ్లంతా బోసిపోయిందని శాంతమ్మ అంటే..వెనక్కి రమ్మంటావా అంటుంది సంధ్య..అమ్మో మీ వదిన నన్ను చంపేస్తుంది అంటుంది. ఎక్కడున్నా మైత్రి సంతోషంగా ఉండాలని కోరుకుంటారు.ఇంతలో హర్ష-నందిని వచ్చి మైత్రిని ఎవరో కిడ్నాప్ చేశారని కంగారుగా చెబుతాడు.
పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటే వద్దంటున్నారని నందిని ఫైర్ అవుతుంది. హర్ష మాత్రం మైత్రికోసం మరింత టెన్షన్ పడుతుంటాడు. మరోవైపు మైత్రి రిలాక్స్ గా ఉంటుంది..ఫ్లైట్ టేకాఫ్ అయ్యేవరకూ ఈ డ్రామా తప్పదు అంటుంది..
చక్రవర్తి ఇంటికి వెళ్తానంటే జయమ్మ కన్నీళ్లుపెట్టుకుంటుంది. నిన్ను బాధపెట్టాలని లేదమ్మా..నేను ఒంటరివాడిని నా జీవితం నాది అంటాడు. మీ అందర్నీ చూడడం ఇష్టమే కానీ మీరున్న చోట ఉండడం కష్టం అందుకే వెళుతున్నా అంటాడు చక్రవర్తి
ఎల్లుండి నీ పుట్టిన రోజు అని జయమ్మ గుర్తుచేస్తుంది..ఆ రోజు దీవించే అవకాశం మీ అమ్మకు ఇవ్వరా అని చక్రవర్తిని పట్టుకుని ఏడుస్తుంది. కట్టిపడేయ్ ముసలి అని క్రిష్ అంటే..ఎప్పుడూ బెదిరింపేనా బతిమలాడ్డం లేదా అని జయమ్మ క్లాస్ వేస్తుంది. ఎల్లుండి మీ పుట్టిన రోజు ఇక్కడే జరగాలి అని సత్య అంటుంది..
మైత్రి కనిపించడం లేదని హర్ష టెన్షన్ పడుతుంటాడు..నందిని ఫైర్ అవుతుంది. ఆ ఇంట్లో టెన్షన్ పీక్స్ కి చేరి ఉంటుంది..ఇక కాల్ చేద్దామా అని మైత్రి ఫ్రెండ్ అంటుంది..కానీ హర్ష నాకోసం ఆలోచిస్తుంటాడు అందుకే ఆగాను అంటుంది. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకునేలోగా కిడ్నాపర్ల నుంచి కాల్ వస్తుంది.
సత్యభామ నవంబరు 13 ఎపిసోడ్ లో సత్య అన్వేషణ ప్రారంభించింది. బిడ్డను మార్చడం అంటే హాస్పిటల్ నుంచే జరిగి ఉండాలి అంటే నా ఎంక్వైరీ అక్కడినుంచే మొదలవ్వాలి అనుకుంటుంది..ఏదో ఫైల్ తీసి ఇదే కదా అనుకుంటుంది..