Satyabhama Serial February 11th Episode Highlights: కౌంట్ డౌన్ స్టార్ట్ చేసిన మహదేవయ్య..సత్య సమస్య క్రిష్ ఎలా తీరుస్తారు - సత్యభామ ఫిబ్రవరి 11 ఎపిసోడ్ హైలెట్స్!

క్రిష్ సంజయ్‌ని లాక్కెళ్లి..సంధ్యకి అనాయ్యం చేస్తే చూస్తూ ఊరుకోనని వార్నింగ్ ఇస్తాడు. రూప అనే గండం నుంచి గట్టెక్కేందుకు ప్లాన్ ఆలోచిస్తాడు సంజయ్
Download ABP Live App and Watch All Latest Videos
View In App
అందరిలో నిల్చోబెట్టి ఆ రూప వాడి దుమ్ము దులుపుతుంది సత్య..వాడిక తప్పించుకోలేడు అంటాడు చక్రవర్తి. పేరుకి నా పెంపకమే కానీ వాడిలో ఉన్న రక్తం సంస్కారం అబ్బనీయలేదు. అందుకే వాడితో అటాచ్ మెంట్ పెంచుకోలేకపోయాను. కోపంలో వాడిని ఏం చేస్తానో అనే భయంతోనే ఇక్కడ వదిలేశాను అంటాడు

చెంప పగలగొట్టాను..మౌనంగా ఉంటే మారుతున్నాడేమో అనుకున్నాను కానీ సంధ్యను ట్రాప్ చేస్తాడు అనుకోలేదు అంటుంది. సంజయ్ ని ఏదైనా అంటే క్రిష్ ప్రమాదంలో పడతాడు అంటాడు చక్రవర్తి. మీరే తన తండ్రి అనే నిజం చెబితే క్రిష్ ని ఎదుర్కోవడం ఎవరి వల్లా కాదంటుంది.
సంజయ్ అంటూ రూప ఎంట్రీ ఇస్తుంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను మోసం చేస్తావా అని నిలదీస్తుంది. రచ్చ రచ్చ చేస్తుంది. ఈ ఫోన్ నిండా మా ఇద్దరి ఫొటోస్, వీడియోస్ ఉన్నాయ్.. నువ్వు పక్కకు పో అని సంధ్యను పక్కకు లాగేస్తుంది
నువ్వు ఎలాంటి ఉచ్చులో చిక్కుకున్నావో అర్థమవుతోందా అని సంధ్యతో అంటుంది సత్య. నీ సంతోషానికి అడ్డుపడుతున్నా అన్నావ్.. ఇప్పటికైనా నిజం తెలిసొచ్చింది కదా అమ్మా నాన్న దగ్గరకు వెళదాం పద అంటుంది
సంజయ్ దీన్ని కాదు.. ఇదే సంజయ్ ని మోసం చేసిందంటూ ఓ వీడియో బయటపెడుతుంది సంధ్య. రూప తనని ఆస్తికోసం ప్రేమించిందని తెలిసి ముందే వదిలేశాడు..ఇదిగో ప్రూఫ్ అంటుంది
ఈమాట ముందే ఎందుకు చెప్పలేదని చక్రవర్తి అంటే..అప్పుడు దొరికిపోయా అనే టెన్షన్లో ఉన్నాడు ఇప్పుడు కట్టుకథ అల్లేశాడు అంటుంది సత్య. అంతా సత్యను టార్గెట్ చేస్తారు.
రూపని కొట్టి బయటకు గెంటేస్తుంది సంధ్య. నా మొగుడిపై నిందలు వేయడం ఇకనైనా ఆపేయ్ అని సత్యకి వార్నింగ్ ఇస్తుంది. మీకు చెప్పకుండా పెళ్లిచేసుకోవడం తప్పే..ఆ తప్పుకి కారణం సంజయ్ కాదు నేను అని కాళ్లకి దండం పెడుతుంది. మహదేవయ్య సంజయ్ ని హగ్ చేసుకుంటాడు.
చీకట్లో ఏడుస్తున్న సత్యను ఎగతాళి చేస్తాడు మహదేవయ్య. మీ మామని బాగానే పిలిచావ్ కానీ ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది అంటాడుయ నా చిన్న కొడుకు ఏం చేసినా దొరకడు..నేను ఇచ్చిన గడవులో ఒక్కరోజే ఉంది..ఆలోచించుకో అంటాడు
సత్యభామ ఫిబ్రవరి 12 ఎపిసోడ్ లో...మా వాళ్ల డీటేల్స్ నీకు పంపించాను చూస్కో...నేను కాల్ చేసి చెప్పిన గంటలో ఫొటోలో ఉన్న ఆమెను చంపేయాలని ఫోన్లో మాట్లాడుతుంటాడు మహదేవయ్య. విని కంగారుపడుతుంది సత్య..