Satyabhama Serial Today December 21 Highlights :సత్యకి-మహదేవయ్యకి ప్రామిస్ చేసి ఇరుక్కుపోయిన క్రిష్ సపోర్ట్ ఎవరికి - సత్యభామ డిసెంబరు 21 ఎపిసోడ్ హైలెట్స్!
సంధ్యని రూమ్ లోకి లాగి డోర్ వేస్తాడు సంజయ్. గడియ పెట్టావెందుకు మా అక్క చూసిందంటే అంతే అంటుంది. నా రూమ్ వైపు అస్సలు రాదులే రిలాక్స్ అయిపో అంటాడు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసత్య సంధ్య గురించి వెతుకుతూ ఉంటుంది. సంజయ్ ముద్దుపెట్టుకునేందుకు వెళుతుంటే సంధ్య బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుందికానీ సంజయ్ ఆ ఛాన్స్ ఇవ్వడు
బర్త్ డే పార్టీ సెలబ్రేషన్స్ కి అందరూ రెడీ అవుతారు. క్రిష్ డ్రెస్ బావుందని మహదేవయ్య అంటే.. సత్య సెలెక్షన్ అంటాడు క్రిష్. తనకి నాపై ఆరాటం ఎక్కువ తనంటే నాకు ప్రాణం అనేసి..ఎవరైనా మా బాపూ తర్వాతే అని ఝలక్ ఇస్తాడు.
చక్రవర్తి వచ్చి విశెష్ చెబుతాడు..పొద్దున్నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నా అంటాడు క్రిష్ . ఇవాళ చిన్నా అన్నదే కాదు సంజయ్ బర్త్ డే కూడా నువ్వు ఎవరికోసం వచ్చావ్ బాబాయ్ అంటుంది నందిని
ఇంతకీ ఎవరికోసం వచ్చావో చెప్పు అని క్రిష్ అంటే..నీకోసమే వచ్చాను..సంజయ్ కి సెంటిమెంట్స్ తక్కువ, నీతో అటాచ్ మెంట్ ఎక్కువ అని క్లారిటీ ఇస్తాడు . ఏంటి మావయ్యా మీ పచ్చబొట్టుకొడుకు బాబాయ్ పై తెగ ప్రేమ కురిపిస్తున్నాడు ఏదో తేడా కొడుతోంది అంటుంది
అందరూ సంజయ్ కోసం అడుగుతుంటే..పిలుస్తానని వెళుతుంది సత్య. రూమ్ లో సంధ్య, సంజయ్ ముచ్చట్లలో మునిగితేలుతుంటారు. సత్య పిలవడంతో సంజయ్ డోర్ తీస్తాడు..ఆ డోర్ వెనుకే దాక్కుంటుంది సంధ్య. సత్య వెంటే సంజయ్ వెళతాడు. సంజయ్ చెప్పినట్టు నిజంగా అక్క రాక్షసిలా మారిపోయింది అనుకుంటుంది సంధ్య
సత్య పుట్టిల్లు తనది అని గొడవ చేసిన వ్యక్తి మహదేవయ్యను కలుస్తాడు. ఎందుకు వచ్చావ్ అని అడిగితే డబ్బు కావాలంటాడు. ఆ వ్యక్తిని చూసి నందిని గుర్తుపట్టేస్తుంది..వాడేంది బాపూతో మాట్లాడుతున్నాడు ఏదో జరుగుతోంది అనుకుంటుంది
కేక్ కట్ చేస్తారు క్రిష్-సంజయ్. బాపూ అని కేక్ తినిపిద్దామని పక్కకు తిరిగేసరికి అక్కడ చక్రీ ఉంటాడు.. సత్య చక్రీకే తినిపించమంటుంది. సంజయ్ మహదేవయ్యకి కేక్ తినిపిస్తాడు. హడావుడిగా వచ్చాను గిఫ్ట్ తేలేదు అంటూ తన మెడలో చైన్ క్రిష్ కి వేస్తాడు.
మరి సంజయ్ కి అని అందరూ అనడంతో నేను గిఫ్ట్ ఇస్తానంటూ మహదేవయ్య తన మెడలో చైన్ వేస్తాడు. అక్కడున్నవాళ్లంతా షాక్ అయి చూస్తుంటారు..
డిసెంబర్ 23 సోమవారం ఎపిసోడ్ లో... నా ఆనందంకోసం ఇంత చేశావ్..నీకోసం ఏం చేయాలో చెప్పు అంటాడు. ప్రాణం పోయినా మాట తప్పను అంటాడు క్రిష్. ఏం జరిగినా నా చేయి వదలను అని ప్రామిస్ చేసి అంటుంది సత్య. మరోవైపు తనని MLA చేస్తానని మాటివ్వు అని మహదేవయ్య కూడా మాట తీసుకుంటాడు..