Satyabhama Serial Today December 04 Highlights :సత్యకు ట్విస్ట్ ఇవ్వబోతున్న మహదేవయ్య..DNA రిపోర్ట్ లో ఏముంది - సత్యభామ డిసెంబరు 04 ఎపిసోడ్ హైలెట్స్!
DNA రిపోర్ట్ ఎలా మార్చాలా అనే టెన్షన్లో ఉన్న మహదేవయ్య దగ్గరకు వచ్చిన సత్య..ఇప్పటికైనా క్రిష్ కి నిజం చెప్పేయండి...తను మిమ్మల్ని ఏమీ అనకుండా చూసుకుంటా అని మాటిస్తుంది సత్య...మహదేవయ్య తగ్గను అంటాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅసలు ఈ గంగ ఎవరు ..మా ఇంటికి ఎందుకు వచ్చిందని ఆలోచిస్తాడు క్రిష్. ఆమె నిద్రపోయి ఉంటుంది..బ్యాగ్ చెక్ చేస్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో అనుకుని రూమ్ కి వెళ్లి వెతుకుతాడు. గంగ బ్యాగ్ లో క్రిష్ చిన్నప్పటి ఫొటో ఉంటుంది. అది తీసుకుని వెళ్లిపోతాడు.
దూరం నుంచి క్రిష్ ని గమనించిన సత్య..నువ్వు ఇలాంటి పనేదో చేస్తావని తెలిసే ముందుగా నీ ఫొటో ఆమె బ్యాగ్ లో పెట్టించా అనుకుంటుంది.
ఆ తర్వాత క్రిష్ దగ్గరకు వెళ్లి ఆ ఫొటో చూసి చిన్నప్పుడు భలే ముద్దుగా ఉన్నావని ఫొటోకి ముద్దుపెడుతుంది. క్రిష్ కి కూడా ముద్దుపెడుతుంది కానీ డల్ గా ఉంటాడు. ఏమైందని అడిగితే గంగ బ్యాగ్ లో ఈ ఫొటో దొరికింది అని చెబుతాడు. ఆమెకు ఎవరో ఇచ్చారని అనుమానపడతాడు.
ఇద్దరి వైపూ ఆలోచిస్తే నిజం తెలుస్తుందంటుంది సత్య. ఆ తర్వాత నువ్వు ఇచ్చింది నువ్వే తీసుకో అని ముద్దిస్తాడు. క్రిష్ ని నవ్వించేస్తుంది..నార్మల్ అయిపోతాడు..
సాంగ్స్ వింటూ కూర్చున్న హర్షకి..మైత్రి ఫ్రెండ్ కాల్ చేస్తుంది. రేపు మైత్రి బర్త్ డే నువ్వు రాకపోతే తనే మీ ఇంటికి వచ్చేస్తుంది అంటుంది. ఇంతలో నందిని రావడం చూసి కాల్ కట్ చేస్తాడు
హల్వా తీసుకొచ్చి ఇచ్చిన నందిని..ఎవరు కాల్ చేశారని అడుగుతుంది. ఆఫీస్ కాల్ అని అబద్ధం చెబుతాడు హర్ష. మైత్రి దగ్గరకు వెళ్లాలా వద్దా అని ఆలోచనలో పడతాడు హర్ష.
గంగవెనుక ఆ నర్సింహం గాడు ఉండి ఇబ్బందిపెడుతున్నాడేమో అని అనుమానపడతాడు క్రిష్. నర్సింహకి కాల్ చేస్తాడు క్రిష్. గంగని నేను పంపిస్తే మీరెందుకు ఇంట్లో పెట్టుకోవాలని నిలదీస్తాడు. గట్టిగా మాట్లాడుతున్నాడంటే గంగ..నర్సింహం మనిషి కాదని ఫిక్సవుతాడు క్రిష్
ఉదయాన్నే సంధ్యకు కాల్ చేసిన సంజయ్.. బయటకు రమ్మని కాల్ చేస్తాడు. ఇంతలో తల్లి పిలుపు విని పడుకున్నట్టు నటిస్తుంది సంధ్య...
సత్యభామ డిసెంబరు 05 ఎపిసోడ్ లో...DNA రిపోర్ట్ వచ్చేసింది. సత్య ఓపెన్ చేస్తుంటే అడ్డుకున్న నర్సింహం.. డాక్టర్ చదవాలంటాడు.. అందులో ఏముందో రేపటి ఎపిసోడ్ లో క్లారిటీ వచ్చేస్తుంది...