Guppedantha Manasu Mukesh Gowda: 'గుప్పెడంతమనసు' రిషి సర్ కాదు ఇకపై లవర్ బాయ్ 'గీతా శంకరం'
మోడల్ గా కెరీర్ ఆరంభించి బుల్లితెరపై అడుగుపెట్టిన ముఖేష్ గౌడకి తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ తో మంచి క్రేజ్ వచ్చింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగుప్పెడంత మనసు సీరియల్ యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్టైంది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమకథ, కుటుంబ సంబంధాల మధ్య ఉండే భావోద్వేగాలు కావడంతో యూత్ కూడా ఈ సీరియల్ ని బాగానే ఫాలో అవుతున్నారు
అయితే కొన్నాళ్లుగా రిషి సీరియల్ లో కనిపించడం లేదు. శైలేంద్ర కిడ్నాప్ చేశాడని కొన్నాళ్లు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని ఇంకొన్నాళ్లుగా నడిపిస్తున్నారు. జిమ్లో ప్రాక్టీస్ చేస్తుండగా ముఖేష్ గాయపడ్డాడట. గాయం కాస్త తీవ్రంగానే ఉండటంతో డాక్టర్స్ బెడ్ రెస్ట్ సజెస్ట్ చేశారట. అందుకే చిన్న బ్రేక్ ఇచ్చాడు రిషి
సీరియల్ హీరో త్వరలో వెండితెరపై ఎంట్రీ ఇవ్వనున్నాడు. గీతా శంకరం మూవీలో హీరోగా నటిస్తున్నాడు రిషి. ప్రియాంక శర్మ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీకి సంబంధించి పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
కాలేజ్ ఎండీగా హుందాగా కనిపించిన రిషి..గీతా శంకరంలో లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు...
ఎస్.ఎస్.ఎం.జి ప్రొడక్షన్స్ పతాకంపై ముఖేష్గౌడ, ప్రియాంక శర్మ జంటగా నూతన దర్శకుడు రుద్ర దర్శకత్వంలో వ్యాపారవేత్త కె. దేవానంద్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
దివాలీ సందర్భంగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ‘గీతా శంకరం’ అనే టైటిల్ ప్రకటించారు.