Karthika Deepam 2 February 17th Highlights : శౌర్యపై కార్తీక్‌తో బలవంతంగా ఒట్టు వేయించిన దీప.. దాసు కోలుకోవాలని హోమం, జ్యోత్స్న పరిస్థితి ఏంటో పాపం.. కార్తీక దీపం 2 ఈరోజు హైలెట్స్

దీప, కాంచన, అనసూయ ఇడ్లీ బండిని కడుగుతూ రెడీ చేస్తూ ఉంటారు. వెనక నుంచి వచ్చిన కార్తీక్ ఏమి చేస్తున్నారంటూ అడుగుతాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
దీంతో దీప కార్తీక్‌తో శౌర్యపై ఒట్టు వేయించి.. దీని జోలికి మీరు రాకూడదని చెప్తుంది. కార్తీక్ షాక్ అయిపోతాడు. ఇది ఇడ్లీ బండి నేను నడుపుతున్నాను అంటే కాంచన, అనసూయ మేము సపోర్ట్ చేస్తామని చెప్తారు.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

షాక్ అయిన కార్తీక్ లోపలికి వెళ్లిపోతాడు. విషయం చెప్పకుండా ఒట్టువేయించుకుంది అనుకుంటాడు. దీంతో కాంచన అర్థమయ్యేలా చెప్పాల్సిందిగా దీప అంటుంది. సరే అమ్మ చెప్తానంటూ దీప కూడా లోపలికి వెళ్తుంది.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
కార్తీక్ బాబు మీరు ఇడ్లీ బండి దగ్గరకి రాకండి. మీరు రెస్టారెంట్‌పై ఫోకస్ చేయండి. అప్పటివరకు మిమ్మల్ని, ఇంటిని చూసుకునే బాధ్యత నాది అంటుంది. దీప ప్రేమ, ఆప్యాయతను అర్థం చేసుకున్న కార్తీక్ అదే పనిలో ఉన్నాను అనుకుంటాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
మరోవైపు ఆడిట్‌ని ఫ్రాడ్ చేసి.. జ్యోత్స్న ఇంట్లో కూర్చొని కార్తీక్‌తో అయిన ఎంగేజ్మెంట్ ఫోటోలు, వీడియోలు చూస్తూ ఉంటుంది. అక్కడికి పారిజాతం వస్తుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
దాసు కోలుకోవాలని పంతులుగారిని పిలిచి హోమం చేయించాలనుకున్నట్లు చెప్తుంది. ఎందుకు అవేమి అవసరం లేదని జ్యోత్స్న చెప్పగా.. వెనకనుంచి ఏమి దాసు కోలుకోవాలని అనుకోవట్లేదా అంటూ దశరథ్ వస్తాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
రెస్టారెంట్ ఆడిట్‌ని జ్యోత్స్న తారుమారు చేసిందని దశరథ్ గ్రహిస్తాడు. జ్యోత్స్నకి దశరథ్‌కి వారసురాలు గురించి తెలుసేమోనని భయపడుతుంది.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
ఉదయాన్నే దీప నిద్ర లేచి.. తులసి కోటకు దీపం పెడుతూ పూజ చేస్తుంటుంది. కార్తీక్ కూడా నిద్రలేచి ఫ్రెష్ అయ్యి.. బయటకు వచ్చి దీప దగ్గరకు వస్తాడు.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
ఏమి చేస్తున్నావ్ దీప అంటే మంచి జరగాలంటే ఉదయాన్నే ఇలా దీపం పెట్టాలంటూ చెప్తే.. కార్తీక్, దీప ఇద్దరూ కలిసి తులసి కోటకు పూజ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)