Karthika Deepam 2 February 15th Highlights : కోటీశ్వరుడైన కార్తీక్ క్యాటరింగ్ చేస్తూ శ్రీధర్ పరువు తీశాడట.. జ్యోత్స్నకి టైమ్ మూడినట్టే, వారసురాలు కాదని తెలిస్తే.. కార్తీక దీపం 2 ఈరోజు హైలెట్స్

గంగాధర్ శ్రీధర్ దగ్గరికి వచ్చి నీ కొడుకు కార్తీక్ లండన్ వెళ్లిపోయాడా.. మీ మేనకోడల్ని కాకుండా ఎవర్నో పెళ్లి చేసుకున్నాడట అంటూ ప్రశ్నలడుగుతుంటే శ్రీధర్ అవమానంతో తలదించుకుంటాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
అక్కడున్న జ్యోత్స్న ఆ కార్తీక్ ఇప్పుడు మీ ఫంక్షన్లో క్యాటరింగ్ చేస్తున్నాడు గంగాధర్ గారు అంటుంది. అంతేకాకుండా దీపను నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

కార్తీక్ అడ్డుకుంటే.. శ్రీధర్ మరింత రెచ్చిపోతాడు. జ్యోత్స్న అడిగినదానిలో తప్పేమి ఉంది. నువ్వు నా పరువు తీస్తున్నావంటూ మాట్లాడతాడు.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
కార్తీక్ అప్పుడు గంగాధర్‌కి కోట్లకు వారసుడైతే ఏముంది అండి. కష్టపడి జీవితంలోకి పైకి రావాలి అనుకోకూడదా అంటూ ప్రశ్నిస్తాడు. అలాగే శ్రీధర్ని సైలంట్‌గా ఉండు.. నోటికి ఏమి వస్తే అది మాట్లాడకు అంటాడు.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
మరోపక్క పారిజాతం జ్యోత్స్నను వారసురాలివి కాదని నిజం తెలిస్తే ఎలా అంటూ హెచ్చరిస్తుంది. దీంతో దాసుకి ఆ గతి పట్టించింది నేనే అనేసి దానిని కవర్ చేస్తుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
దశరథ్‌కి డాక్టర్ కాల్ చేసి దాసు కోలుకుంటున్నాడని చెప్తాడు. దీంతో దశరథ్ చాలా విషయాలు తెలుసుకోవాలని దాసు త్వరగా రికవరీ అవ్వాలని.. వారసురాలు గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
దీప, కార్తీక్ ఇంటికి వెళ్లి వంటలు బాగున్నాయని మెచ్చుకున్నారని చెప్తారు. అలాగే శ్రీధర్, జ్యోత్స్న చేసిన రచ్చగురించి కూడా చెప్తారు.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
వాళ్ల మాటల పట్టించుకోకండి.. అని దీప కార్తీక్‌కి చెప్తుంది. అలాగే కార్తీక్‌ను ఎలా అయినా సక్సెస్ చేయాలని మనసులో అనుకుంటుంది.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
మరోవైపు అకౌంటెంట్‌కి ఫోన్ చేసి.. నష్టాలను కవర్ చేసి లాభాలుగా చూపించమని జ్యోత్స్న చెప్తుంది. వెనుకనుంచి వచ్చిన దశరథ్ ఇంకెన్ని విషయాలు దాస్తావు జ్యోత్స్న అనడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)