Manchu Manoj: మంచు మనోజ్ కామెంట్స్‌తో హైలైట్ అయిన 'జగన్నాథ్' - అసలు ఆ సినిమా గురించి తెలుసా?

రాయలసీమ భరత్ హీరోగా నటిస్తున్న సినిమా 'జగన్నాథ్'. ఇందులో ప్రీతి హీరోయిన్. దీనికి ఇద్దరు దర్శకులు... భరత్, సంతోష్. భరత్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకం మీద పీలం పురుషోత్తం ప్రొడ్యూస్ చేస్తున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమంచు మనోజ్ ముఖ్య అతిథిగా 'జగన్నాథ్' సినిమా ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేశారు. ఏపీలోని అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఈ ప్రోగ్రాం జరిగింది. ఆ ఈవెంట్ లో తన జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంతమంది తనను తొక్కాలని చూసినా, తనపై బురద చల్లాలని ఆలోచించినా, ఆ నాలుగు గోడల మధ్యకు తనను రానివ్వకుండా చేసినా సరే తనను జనాల గుండెల్లోంచి తీసేయలేరని మనోజ్ కామెంట్ చేశారు. తనను తొక్కలన్నా, లేపాలన్నా అది అభిమానుల వల్ల మాత్రమే సాధ్యమవుతుందన్నారు.

'జగన్నాథ్' సినిమా గురించి మంచు మనోజ్ మాట్లాడుతూ... ''తమ్ముడు 'రాయలసీమ' భరత్ హీరోగా చేసిన ఫస్ట్ మూవీ ఇది. ఎంతో ప్రొఫెషనల్‌గా చేశాడు. టీజర్ చూస్తుంటే... యూనిట్ లో ప్రతి ఒక్కరి కష్టం కనిపిస్తోంది. భరత్ ఫ్రెండ్స్ అందరూ సినిమా నిర్మాణంలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో సినిమా తీయడం అంత సులభం కాదు. సినిమా పెద్ద హిట్ కావాలి'' అని అన్నారు.
'రాయలసీమ' భరత్ మాట్లాడుతూ... ''మంచి మనసున్న మంచు మనోజ్ అన్న మా 'జగన్నాథ్' టీజర్ లాంచ్‌కు స్వచ్ఛందంగా వచ్చారు. నాకు సినిమాలు అంటే ఇష్టం. అందుకని, ఎంతో కష్టపడి ఇండస్ట్రీకి వచ్చా. ఈ సినిమా మా ఐదేళ్ల కృషి.ఈ ప్రయాణంలో నాకు అండగా ఉంటూ సపోర్ట్ చేసిన వెంకీ, చైతూ, కదిరి బాషాకు థ్యాంక్యూ'' అన్నారు.
'జగన్నాథ్' సినిమాకు సహ నిర్మాతలు: మదినే దుర్గారావు - బుక్కే వేను మాధవి - బుట్టమనేని వెంకటేష్ - నాగ చైతన్య రాయల్స్, సంగీతం: శేఖర్ మొపూరి, కథ - మాటలు: నందమూరి హరి - ఎన్టీఆర్, మాటలు - కథనం: శివక్ వాలి - క్రాంతి కుమార్ కొండెల.