Serial Actor Kiran Raj Injured in a Road Accident: రోడ్డు ప్రమాదంలో గాయపడిన సీరియల్ నటుడు.. సెప్టెంబరు 12న తను హీరోగా నటించిన సినిమా రిలీజ్!
'కన్నడత్తి' సీరియల్ నటుడు కిరణ్ రాజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఛాతికి బలమైన గాయాలు కావడంతో ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. బెంగళూరు సమీపంలో కారు డివైడర్ ను ఢీకొట్టింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకిరణ్ రాజ్ నటించిన 'రాణి' మూవీ సెప్టెంబరు 12 న విడుదలవుతోంది. ప్రమాద సమయంలో 'రాణి' సినిమా ఎగ్జిక్యూటివ్ నిర్మాత గిరీష్ కూడా కారులో ప్రయాణిస్తున్నారు..ఆయన సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు
కిరణ్ రాజ్ ప్రతివారం... గుట్టాయన పాళ్యం సమీపంలో ఉన్న శరణార్థి కేంద్రానికి భోజనం పెట్టేందుకు వెళుతుంటాడు. అక్కకు ఆహారం తీసుకుని వెళుతుండగా ఈ ఘటన జరిగింది..
మొదట హిందీ సీరియల్స్ లో నటించిన కిరణ్ రాజ్.. ఆ తర్వాత కన్నడ స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చాడు. 'కన్నడత్తి' సీరియల్లో హర్ష పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది.
ప్రస్తుతం కిరణ్ రాజ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నాడు..ఇలాంటి టైమ్ లో తను నటించిన రాణి మూవీ విడుదలవుతుందా వాయిదా పడుతుందా అనే గందరగోళం నెలకొంది..
సీరియల్ నటుడు కిరణ్ రాజ్
సీరియల్ నటుడు కిరణ్ రాజ్