Guppedantha Manasu August 20th Episode: రిషి , మహేంద్రకి నిజం చెప్పేసిన వసుధార - మనుని టార్గెట్ చేసిన శైలేంద్ర
అనుపమ వాళ్ల ఇంటికి తానూ వస్తానని మహేంద్ర అంటే..వద్దని చెబుతాడు రిషి. అయితే వసుధార నన్ను అవాయిడ్ చేసి అనుపమను కలవాలని అనుకుంటోంది..అంటే ఏదో దాచిపెడుతోందనే డౌట్ మహేంద్రకు వస్తుంది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశైలేంద్ర మనుకి కాల్ చేసి బ్రదర్ అని మనది రక్తసంబంధం అని రెచ్చగొడుతుంటాడు. ఓసారి కలుద్దాం అన్న శైలేంద్రతో నీకు ఏం కావాలని అడుగుతాడు. నానుంచి విలువైన సమాచారం వస్తుందని శైలేంద్ర అంటాడు. మను కోపంగా మాట్లాడుతుండగా అనుపమ వింటుంది.
మరోవైపు శైలేంద్ర నువ్వు నన్ను కలిసేందుకు రాకపోతే..మీ అమ్మకు కాల్ చేసి నన్ను కిడ్నాప్ చేసిన విషయం, నీ తండ్రి ఎవరో తెలుసుకున్న విషయం చెప్పేస్తానని బెదిరిస్తాడు. కాల్ కట్ చేసి కోపంగా బయలుదేరుతాడు మను..అనుపమలో అనుమానం మొదలవుతుంది.
రిషిధార..అనుపమను కలసి మను గురించి అడుగుతారు. ఇప్పుడే హడావుడిగా వెళ్లిపోయాడని , తన ప్రవర్తన అంతుపట్టకుండా ఉందంటుంది. అనుపమతో కలసి కిచెన్లోకి వెళ్లిన వసుధార..మను తండ్రి విషయం రిషికి చెబుదాం అని నిర్ణయించుకున్నానంటుంది. రిషికి తెలిస్తే సమస్యలు వస్తాయని అనుపమ భయపడుతుంది కానీ..తను సమస్యను సాల్వ్ చేస్తారని ధైర్యం చెబుతుంది. ఏ విషయం అంటూ లోపలకు వస్తాడు రిషి..
శైలంద్రకి గన్ గురిపెట్టిన మనుకి రివర్స్ వార్నింగ్ ఇస్తాడు శైలేంద్ర. మీ నాన్న ఎలా ఉన్నారంటూ కావాలని మనుని ఇరిటేట్ చేస్తాడు. తండ్రి ఎవరో చెబితే చంపేస్తానన్నావ్..ఇప్పుడు మా బాబాయ్ ని ఏం చేయబోతున్నావ్ అని క్వశ్చన్ చేస్తాడు. నీ తండ్రి మా బాబాయ్ అని తెలియగానే వారసత్వం, పేరు వస్తుందని ఆశపడుతున్నావా అని రెచ్చగొడతాడు. నీకు ఎవరికి చెప్పాలనిపిస్తే చెప్పుకో...ఆగష్టులోగా ఏం చేస్తానో చూడు అనేసి మను వెళ్లిపోతాడు
మను తండ్రి గురించి వసుధార చెప్పబోతుండగా..ఆపిన రిషి.. మీరు నిజం దాచిపెట్టారంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది..అందుకే ఎవరో చెప్పమని అడగడం లేదు..ఎందుకు చెప్పకూడదని అనుకుంటున్నారో చెప్పండి అంటాడు. చెప్పలేనని అనుపమ అనడంతో రిషి... తను చెడ్డవాడా , నీచుడా అంటూ తక్కువచేసి మాట్లాడుతాడు. అప్పుడు వసుధార బయటపడిపోతుంది..మను తండ్రి మావయ్యే అని చెప్పేస్తుంది
అప్పుడే అక్కడకు వచ్చిన మహేంద్ర కూడా ఆ మాట విని షాక్ అవుతాడు. రిషి కూడా పెద్ద షాక్ లోనే ఉంటాడు. ఇదంతా కాల నిర్ణయం ఇందులో నా తప్పులేదు..కానీ నేను తప్పుచేశానంటూ అనుపమ అక్కడి నుంచి వెళ్లిపోతుంది..మహేంద్ర చూస్తుండిపోతాడు...
గుప్పెడంత మనసు సీరియల్(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)