Gunde Ninda Gudi Gantalu March 18th Episode Highlights: సంజన్ ని సపోర్ట్ చేస్తూ బాలుని నిలదీసిన మౌనిక .. షాక్ లో మీనా,శృతి - గుండె నిండా గుడి గంటలు మార్చి 18 ఎపిసోడ్ హైలెట్స్!

బాలు టిఫిన్ తింటుంటే..ప్రభావతి హడావుడి చేస్తుంది. తొందరగా వెళ్లిపో..మౌనిక అత్తింటివాళ్లు వస్తే లేనిపోని గొడవ జరుగుతుందంటుంది. టిఫిన్ తిననీ అని తండ్రి సత్యం అంటాడు. ఎవరి స్వార్థంవాళ్లది అంటూ ప్రభావతి నోరు పారేసుకుంటుంది
Download ABP Live App and Watch All Latest Videos
View In App
మీనా కోపంగా చూడడంతో..వాడివల్ల ఈ ఫంక్షన్ చెడిపోతే మౌనిక బాధపడదా అని రివర్సవుతుంది ప్రభావతి. నేను వీడిని తినొద్దు అనలేదు..తిండికి మొహం వాచిపోయినట్టు ఎలా తింటున్నాడో అంటూ ప్లేట్ నుంచి లేచి వెళ్లేవరకూ తిడుతుంది ప్రభావతి. మీనా బాధపడుతుంది

బాలు బయటికి వెళ్లేందుకు కారు తీసేందుకు క్లీన్ చేస్తుంటాడు..అదే సమయానికి మౌనిక అత్తింటివారు ఎంట్రీ ఇస్తారు. సంజయ్ అత్త చంద్రకాంతంగా కార్తీకదీపం భాగ్యం వస్తుంది. బాలుని చూసి అవమానించాలని ప్లాన్ చేసుకుంటాడు సంజయ్. అదే విషయం అత్త చంద్రకాంతంకి చెబుతాడు
ఎంట్రీతోనే ఇల్లు చూసి.. ఇది మన పాలేరు ఇంటికన్నా అధ్వాన్నంగా ఉందికదా అంటుంది చంద్రకాంతం. మనలాంటి వాళ్ల ఇంటికి పెద్ద గేట్ ఉండాలి..ఇక్కడ గేట్ చిన్నగా ఉన్నా ఏ దొంగో వచ్చినా చెంబులు తప్ప ఏం దొరకవు అంటుంది. మీ అత్త పూలు అమ్ముతుందా అని అడుగుతుంది.
ఈ రౌడీగాడు ఇంకా ఇక్కడే ఉన్నాడేంటని మౌనిక మావయ్య అంటే.. వెళ్లిపోతున్నాడు అంటూ వెళ్లిపో బాలు అంటుంది ప్రభావతి. వీళ్లకో కారు, డ్రైవరా అని చంద్రకాంతం అంటే వాడు మా రెండో అబ్బాయి అంటాడు సత్యం.
మీ చెల్లెలు ఫంక్షన్ జరుగుతుంటే నువ్వు ఎలా వెళ్తావు బావా అని సంజయ్ అంటే.. దగ్గరుండి ఫంక్షన్ చేస్తానంటూ లోపలకి వస్తాడు బాలు. చంద్రకాంతం అందరిపై సెటైర్స్ వేస్తుంటే.. బాలు, శ్రుతి ఇద్దరూ కౌంటర్లు ఇస్తారు.
బావ కాళ్లు కడగాలి కదా అన బాలుని ఇరికించేందుకు ప్లాన్ చేస్తారు. అయితే పెద్దవాడు ఉన్నాడుకదా అంటూ మీనా మెలికిపెడుతుంది. ఇక చేసేది లేక ప్రభావతి మనోజ్ తో కాళ్లు కడిగిస్తుంది
మనోజ్ కాళ్లు కడిగిన తర్వాత సంజయ్ డబ్బులిస్తాడు. మనోజ్ అవి చూసి మురిసిపోతుంటే సైటెర్స్ వేస్తాడు బాలు
గుండె నిండా గుడిగంటలు మార్చి 19 ఎపిసోడ్ లో ... ఆ ఇంట్లో నువ్వు సంతోషంగా ఉన్నావా అని మౌనికను మీనా అడుగుతుంది..శ్రుతి కూడా అదే మాట అంటుంది. మౌనిక నోరు జారుతుందేమో నువ్వు వెళ్లు అని సంజయ్ ని పంపిస్తాడు తండ్రి. భర్తను చూసిన మౌనిక కావాలనే బాలుపై ఫైర్ అవుతుంది. అది గమనించని బాలు షాక్ అవుతాడు