Gunde Ninda Gudi Gantalu March 11th Episode Highlights: డబ్బులివ్వాలట కానీ బాలు మీనా ఇంట్లో ఉండకూడదు.. ఏం కుటుంబంరా బాబు - గుండె నిండా గుడి గంటలు మార్చి 11 ఎపిసోడ్ హైలెట్స్!
జాబ్ లేకుండా ఇంటికి తిరిగొచ్చిన మనోజ్ ని ఓ ఆట ఆడుకుంటాడు బాలు. ప్రభావతి, రోహిణి రివర్సైనా కానీ తగ్గడు బాలు. ఎవరో అన్నారు ఉద్యోగం లేనివాడు భార్యను ఎలా చూసుకుంటాడు అన్నారు ఇదిగో నా సంపాదనతో నా భార్యకి హల్వా తీసుకొచ్చానంటూ తినిపిస్తాడు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబాలు పదే పదే తన భర్తని టార్గెట్ చేయడం బాలేదని బాధపడుతుంది రోహిణి. మలేషియా నుంచి మీ నాన్న వస్తే అన్ని సమస్యలూ తీరిపోతాయంటుంది. అమ్మో నా గతం బయటపడుతుందేమో అని భయపడుతుంది రోహిణి
మౌనికకు తాళి మార్చే ఫంక్షన్ చేద్దాం అంటుంది ప్రభావతి. రోహిణికి కూడా చేద్దాం అంటాడు సత్యం. అప్పుడే వచ్చిన మీనాపై నోరు పారేసుకుంటుంది ప్రభావతి. ఇంతలో రోహిణి రావడంతో అదే మాట చెబుతారు
మానాన్న హైదరాబాద్ లో లేరు మలేషియాలో ఉన్నారు..ఇప్పట్లో రావడం కుదరదు అని అబద్ధం చెబుతుంది. ముందు మౌనికకు చేసేద్దాం అంటుంది ప్రభావతి.
తన ఫ్రెండ్ ని కలిసిన రోహిణి..ఇంట్లో జరుగుతున్నవన్నీ చెబుతుంది. ఇంకా ఎన్నాళ్లు ఇలా అబద్ధాలు చెబుతావు వెంటనే ఏదైనా పరిష్కారం చూడాలి అంటుంది దివ్య.
మౌనిక తాళి ఫంక్షన్ కి రెండున్నర లక్షలు ఖర్చు అవుతుందని చెబుతాడు సత్యం. మనోజ్, రవికి చెబితే ఇలాంటి ఫంక్షన్లు అవసరమా అని ఫైర్ అవుతారు. డబ్బులు తాము సర్దుతాం అని ముందుకొస్తారు రోహిణి, శృతి. కానీ బాధ్యత మొత్తం తను తీసుకుంటాడు బాలు
గుండెనిండా గుడిగంటలు మార్చి 12 ఎపిసోడ్ లో మౌనిక అత్తగారింటికి వెళ్లి సత్యం, ప్రభావతి తాళి మార్చే ఫంక్షన్ గురించి మాట్లాడుతారు. బాలు ఆ ఇంట్లో ఉంటే ఫంక్షన్ కి వచ్చేది లేదని మౌనిక భర్త, మామ కండిషన్ పెడతారు.