Chinni Serial on Star Maa: నాగవల్లి... 'చిన్ని' సీరియల్లో పార్వతి చెల్లి... ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

Esha Manohari Priya joins Chinni serial as Nagavalli: 'ఎవరు నువ్వు?' - కటకటాల వెనుక ఉన్న హీరోయిన్ అడుగుతుంది. 'వల్లి... నాగవల్లి... నువ్వు చంపిన పార్వతి చెల్లిని. చావును నీకు పరిచయం చేయడానికి వచ్చిన కల్పవల్లిని' అని చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయే. ఇంతకీ, ఈ అమ్మాయి ఎవరో తెలుసా?
Download ABP Live App and Watch All Latest Videos
View In App
చిన్ని సీరియల్లో నాగవల్లి క్యారెక్టర్ చేసిన ఈ అమ్మాయి పేరు ఈషా మనోహరి ప్రియ. ఈమె హైదరాబాద్ సిటీలోని గచ్చిబౌలి ఏరియాలో ఉంటుంది. అయితే ఈషా సొంతూరు విశాఖ. అక్కడ గాజువాకలోని కాలేజీలో చదువుకుంది. సోషల్ మీడియాతో పాపులర్ అయ్యింది. ఇన్స్టా రీల్స్ చేసింది. సినిమా ప్రమోషన్స్ కూడా! ఇప్పుడు ఈ అమ్మాయి 'చిన్ని' సీరియల్ ద్వారా టీవీలో ఎంట్రీ ఇచ్చింది.

ఈషా మనోహరి ప్రియ క్లాసికల్ డ్యాన్సర్ కూడా! గతంలో కొన్ని ప్రదర్శనలు ఇచ్చింది. టీవీ సీరియల్ హిట్ అయితే మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.
సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ రాత్రి ఏడు గంటలకు 'చిన్ని' సీరియల్ టెలికాస్ట్ అవుతోంది.
చిన్ని సీరియల్ లో మెయిన్ హీరోయిన్ రోల్ చేసిన అమ్మాయి పేరు కావ్య. రీసెంట్ బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ - ఆ అమ్మాయి ప్రేమలో ఉన్నారని, బ్రేకప్ అయ్యాక నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్లాడని ఆ మధ్య ప్రచారం జరిగింది.