Brahmamudi Serial Today March 18th Episode Highlights: చెలియ గుండె తాకలేక పలకనందే నా మౌనం.. యామినికి షాక్ ఇచ్చిన రాజ్ - బ్రహ్మముడి మార్చి 18 ఎపిసోడ్ హైలెట్స్!

యామిని ఏవో పేపర్లు చూస్తుంటే ఏంటని తల్లిదండ్రులు ఆరాతీస్తారు. రాజ్ కి గతం గుర్తుకురాకూడదు, తన వాళ్లు ఎవరూ తనని చూడకూడదు..అందుకే ఫారెన్ తీసుకెళ్లి పెళ్లి చేసుకుని అక్కడే సెటిలైపోతాం అంటుంది
Download ABP Live App and Watch All Latest Videos
View In App
నువ్వు ఇప్పటికే చాలా తప్పులు చేస్తున్నావ్..దీనికి నేను ఒప్పుకోను అంటాడు యామిని తండ్రి. ఇంతలో రాజ్ వచ్చి ఏంటి డిస్కషన్ అని అడిగితే ఫారెన్ విషయం చెబుతుంది యామిని. నాకు కొంచెం టైమ్ కావాలని వెళ్లిపోతాడు రాజ్

మరోవైపు కావ్య రాజ్ ఆలోచనల్లో ఉంటుంది. కావ్య చేతికి ఉన్న గాజులు టేబుల్ కి తగిలి పగిలిపోతాయి. గతంలో గాజులు తీసుకొచ్చి చేతికి వేసిన సీన్ గుర్తుచేసుకుంటుంది.
నిద్ర మధ్యలో మెలుకువ వచ్చినప్పుడు నీ గాజుల సౌండ్ వింటే బావుండేది..కానీ నువ్వు పడుకునేముందు గాజులు తీసేసి పడుకుంటున్నావ్. అందుకే చిన్న సైజ్ గాజులు తీసుకొచ్చి వేశానంటాడు.
రాజ్ తన పక్కనే ఉన్నట్టు కలవరిస్తుంది కావ్య..అప్పుడే అటు వచ్చిన ఇందిరాదేవి కావ్యను చూసి షాక్ అవుతుంది. కిందకు వెళ్లి సుభాష్ కావ్యను చూస్తే భయం వేస్తోందిరా అని చెప్పి బాధపడుతుంది. మరోసారి రుద్రాణి నోటికి పనిచెబుతుంది. అపర్ణ ఇచ్చి పడేస్తుంది
స్వప్న కూడా క్లాస్ వేయడంతో..ఈ ఇంట్లో మాక్ వాక్ స్వాతంత్ర్యం లేదా అంటుంది రుద్రాణి. సందు దొరికినప్పుడల్లా కుక్కలా మొరుగుతున్నావ్ కదా ఇంకా వాక్ స్వాతంత్ర్యం లేదంటావా అంటాడు ప్రకాశం.
ఏం జరిగిందని సుభాష్ అడిగితే..రాజ్ వస్తాడని ఇంకా నమ్ముతోందని బాధపడుతూ చెబుతుంది. కావ్యను మంచి డాక్టర్ కి చూపించాలని డిసైడ్ అవుతారు. పనిలో పనిగా పురోహితుడిని పిలిపించండి రాజ్ కర్మలు జరిపించాలంటుంది రుద్రాణి.. అపర్ణ తిడుతుంది
రాజ్ ఆలోచనల్లో పడతాడు. కావ్యను హాస్పిటల్ కి తీసుకెళ్లిన విషయం గుర్తుచేసుకుంటాడు. మరోవైపు కావ్య కూడా రాజ్ ఆలోచనల్లో ఉంటుంది
యామిని వచ్చి భుజంపై చేయి వేస్తుంది. తీసేస్తాడు రాజ్. నీ స్పర్శ నాకు పరిచయం లేనట్టుంది..రోడ్డుపై కళ్లు తిరిగిపడిపోయిన అమ్మాయి స్పర్శ నాకు గుర్తొస్తోంది. ఆమెను చూడగానే ఏదో జ్ఞాపకం ఊగిసలాడుతోంది అంటాడు. వీలైనంత తొందరగా రాజ్ ని ఫారెన్ తీసుకెళ్లిపోవాలి అనుకుంటుంది యామిని
బ్రహ్మముడి మార్చి 19 ఎపిసోడ్ లో రాజ్ కి కర్మకాండలు జరిపిస్తుంటారు..అదంతా చూసి కావ్య ఆవేశంతో ఊగిపోతుంది.. రాజ్ బతికే ఉన్నాడని కావ్య నమ్ముతుంది...