Brahmamudi Serial Today March 15th Episode Highlights: దొరికిపోయన రాజ్, అప్పు వేట మొదలిక, బెడిసికొట్టిన రుద్రాణి ప్లాన్ - బ్రహ్మముడి మార్చి 15 ఎపిసోడ్ హైలెట్స్!

దుగ్గిరాలవారింట్లో అంతా రాజ్ గురించి ఆలోచించి బాధపడతారు. కావ్య ఏమీ తినదు, తాగదు బాధగా కూర్చుంటుంది. బావ షర్ట్ ని ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ కి పంపించాను దానిపై ఉన్న రక్తపు మరకలు బావవే అని చెబుతుంది అప్పు. ఆ మాటలు విని మరింత కుమిలిపోతుంది అపర్ణ
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ఆ రిపోర్ట్ లాక్కుని కావ్య కోపంగా చింపేస్తుంది. ఏం చేస్తున్నావ్ అని అంతా క్వశ్చన్ చేస్తే అబద్ధాన్ని ముక్కలు చేస్తున్నా అని అందరిపై కోప్పడుతుంది. మీరు నమ్మినా నమ్మకున్నా ఆయనబతికే ఉన్నారని నేను నమ్ముతున్నా అంటుంది

ఇదంతా నిన్ను ఎవరు చేయమన్నారని అప్పుపై ఫైర్ అవుతుంది కావ్య. రాజ్ లేడని ప్రూఫ్స్ ఉన్నాయి అది నమ్మాలా.. బతికే ఉన్నాడనే నీ గాలి మాటలు నమ్మాలా అని రుద్రాణి నోరు పారేసుకుంటుంది.
నువ్ ఎమోషనల్ అయినంత మాత్రానా నిజం అబద్ధం అయిపోదని రాహుల్ అంటే..ఆయన్ను నేను తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను అంటుంది కావ్య. పిచ్చిదానిలా మారిపోతున్న కావ్యను కాపాడుకోవడం అవసరం అని లేని ప్రేమ నటిస్తుంది రుద్రాణి. ఇలా మాట్లాడితే నీ పళ్లు రాలుతాయ్ అని క్లాస్ వేస్తుంది ఇందిరాదేవి.
వీళ్లంతా ఇలానే ఉంటే మన కంపెనీ ఏమైపోతుందో నువ్వే బాధ్యత తీసుకో అంటుంది రుద్రాణి. అవసరం లేదంటాడు సుభాష్. నీ కొడుక్కి అంత సీన్ లేదు అన్నయ్య చూసుకుంటాడు అని ప్రకాశం అంటాడు. మా వీక్ నెస్ క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేయకు.. నేను, నా తమ్ముడు కంపెనీ బాధ్యతలు చూసుకుంటాం అని రుద్రాణికి షాక్ ఇస్తారు
రాజ్ ని చూసి యాక్షన్ స్టార్ట్ చేస్తుంది యామిని. పెళ్లి క్యాన్సిల్ అయిందని అంతా అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నా అని ఫోన్ విసిరికొడుతుంది. సారీ చెప్పిన రాజ్ నా మనసు గందరగోళంగా ఉందని అంటాడు. కొంచెం గడువు కావాలని అడుగుతాడు
నిన్ను ఫోర్స్ చేయను అంటూ వెళ్లిపోతున్న యామిని చేయి పట్టుకున్న రాజ్..బాధపడుతున్నావా అని అడుగుతాడు. నీకు గతం గుర్తురాక మనిద్దరం దూరం అయిపోతాం అనే భయం ఉందంటుంది. బయటకు వెళితే మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటాడు
కారులో బయటకు వచ్చిన రాజ్-యామినిని చూస్తుంది కావ్య. డ్రైవర్ ను కారు ఆపమని చెప్పి ఆ వెనుకే పరిగెత్తుతుంది. ఓ చోట కారు ఆపి యామిని డ్రెస్ తెచ్చుకునేందుకు వెళుతుంది. ఇంతలో అక్కడకు వచ్చిన కావ్య..కళ్లు తిరిగి పడిపోతుంది
బ్రహ్మముడి మార్చి 17 ఎపిసోడ్ లో తనను హాస్పిటల్ లో జాయిన్ చేసిన వ్యక్తి ఎక్కడున్నాడని అందర్నీ అడుగుతుంది. ఇప్పుడే వెళ్లారని హాస్పిటల్ వాళ్లు చెప్పడంతో వెళుతుంది కానీ అప్పటికే రాజ్ వెళ్లిపోతాడు. ఇంట్లో రుద్రాణి మళ్లీ రాజ్ లేడనే చర్చ పెడుతుంది..ఆయన బతికే ఉన్నారంటూ కావ్య ఎంట్రీ ఇస్తుంది