Bhanumathi Serial Today March 15th Episode 06 Highlights: పార్థుతో భానుమతికి పెళ్లి చేసేసిన సీతారాములు .. భువన పోరు మొదలిక - భానుమతి మార్చి 15 ఎపిసోడ్ హైలెట్స్!

శారదా..పార్థు అమ్మా అని పిలుస్తున్నాడా అని అడుగుతుంది ఆమె అత్తయ్య. ఎవరో చిన్నప్పుడే వాడి మనసులో సవతి తల్లిపై విషం నింపారు..పరిస్థితులు వాడిని మారుస్తాయని సర్దిచెబుతుంది
Download ABP Live App and Watch All Latest Videos
View In App
పార్థుకి ఈ పల్లెటూర్లో ఎవరో చదువురాని పిల్లను వెతికి పెళ్లిచేసేట్టున్నారు..అలా జరగకుండా నా కూతుర్ని పార్థు పెళ్లిచేసుకునేలా నువ్వే చేయాలి వదినా అంటుంది పార్థు అత్తయ్య. పార్థుతో భువన పెళ్లి జరిపిస్తే ఆ ఇంట్లో మన ఆటలు సాగవు అది ఎప్పటికీ సాధ్యం కానివ్వను అని కొడుకు, కోడలితో అంటుంది శక్తి

అరటి పళ్లు దొంగతనం చేసిన నానమ్మకి బుద్ధిచెప్పి లోపలకు తీసుకెళ్తుంది భానుమతి. ఏంటి ఇన్ని వంటలు చేశావ్ అని తల్లిని అడిగితే.. విశ్వనాథం గారింటికి చుట్టాలు వచ్చారంట క్యాటరింగ్ ఇచ్చారు అంటుంది భానుమతి తల్లి
తాను చేసిన శపథం గురించి ఆలోచిస్తాడు బలరాం.మరోవైపు భోజనాలు తీసుకొచ్చిన భానుమతి ఫ్యామిలీని శక్తి అవమానిస్తుంది. మన చెప్పుల్ని దూరంగా వేయమంటుందా అనే కోపంతో వాళ్ల చెప్పులు తీసి కుప్పలో పడేస్తుంది..ఇప్పుడు వాళ్లు ఇవన్నీ తీయాలి అంటుంది
పామంటే నాకు భయం ఏంటి అనే మాటలు వినిపించడంతో అటు వెళ్లిన భాను..పార్థుని చూస్తుంది. పాము పాము అని భానుమతి అరవడంతో దాక్కుంటాడు పార్థు.
భానుమతి ఊహల్లో మునిగిపోతాడు పార్థు.. సూరి డబ్బులు అడిగితే ఆ బస్ అమ్మాయి అడ్రస్ కావాలి అని మెలిక పెడతాడు. ఇంతలో భువన రావడంతో తప్పించుకుని వెళ్లిపోతాడు
క్యాన్లు మోయలేక పొలాల గుట్టుపై ఆగుతారు భానుమతి సిస్టర్స్. ఇంతలో పార్థుని చూసి పాము పాము అని అరవడంతో భయపడి చేలో పడిపోతాడు. నువ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది భానుమతి
తల్లితో కలసి కోటిగాడు ఇంట్లోనే తాగడం మొదలుపెడతాడు..భానుమతి తల్లి ప్రమీల వచ్చి తిట్టి ఇంట్లోంచి పంపించేస్తుంది
భానుమతిని ఏదో పనిపై విశ్వనాథం ఇంటికి పంపిస్తుంది తల్లి ప్రమీల. అక్కడ తుమ్ముతూ కూర్చున్న పార్థుని జీప్ అబ్బాయ్ అని పిలుస్తుంది. ఊహ అనుకుంటాడు ...అంతలో బావా అని పిలవడంతో వెళ్లి చూస్తాడు. నిజంగానే వచ్చిందని సంతోషపడతాడు. సారీ చెబుతుంది భాను
సీతారాముల కల్యాణం జరిపించేందుకు గుడికి వెళతారు బలరాం అండ్ ఫ్యామిలీ.. అదే టైమ్ కి ఎగ్జామ్ రాసే పెన్ను దేవుడి దగ్గర పెట్టేందుకు వస్తుంది భానుమతి. నా మనసుకి నచ్చిన బస్ అమ్మాయితో నా పెళ్లి జరగాలని కోరుకుంటాడు పార్థు..దండ వచ్చి ఇద్దరి మెడలో పడుతుంది...