Brahmamudi Serial Today December 11 Highlights : ఇకపై దుగ్గిరాలవారింటి మహరాణి కావ్య .. రాజ్ కూడా బంటుగా మారాల్సిందే - బ్రహ్మముడి డిసెంబరు 11 ఎపిసోడ్ హైలెట్స్!
రాహుల్ కి రాజ్ డబ్బివ్వలేదనన్న అక్కసుతో ధాన్యలక్ష్మి దగ్గరకు వెళ్లి రెచ్చగొడుతుంది రుద్రాణి. రంగంలోకి దిగిన ధాన్యలక్ష్మి నోటికి పనిచెబుతుంది. ఒకప్పుడు అనామికకు 2 కోట్లు ఇచ్చావ్ కదా ఇప్పుడు అదే రెండు కోట్లు నాకివ్వు అంటుంది. అప్పుడు కళ్యాణ్ కి మంచి జరగాలని ఇచ్చాను..ఇప్పుడు నువ్వు అపాత్రదానం చేస్తానంటున్నావ్ అంటాడు రాజ్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆస్తి గొడవల వల్లే మా నాన్న ఆసుపత్రి పాలయ్యారు..ఆయన తిరిగి వచ్చాక చూద్దాం అంటాడు సుభాష్.. ఆయన తిరిగి రాకపోతే ఏంటి పరిస్థితి అంటుంది రుద్రాణి..
ఏం మాట్లాడుతున్నావ్ అంటూ ఆవేశంగా ముందుకొచ్చిన ఇందిరాదేవి లాగిపెట్టి కొడుతుంది. అసలు నీకు నీ కొడుక్కి ఈ కుటుంబంతో సంబంధం లేదు దిక్కున్నచోట చెప్పుకోండి అంటాడు ప్రకాశం
నాకేం ఖర్మ..ఇదే ఇంట్లో దమ్ముతో నిలబడగలను. ధాన్యలక్ష్మితో పాటూ నేనూ అడుగుతున్నా ఆస్తి పంచాల్సిందే ఎవరి వాటా వాళ్లకి ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తుంది. నాన్న ఏదైనా నీకివ్వాలంటే కాదనం..కానీ నాన్న ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఇలా ప్రవర్తిస్తే నిన్ను ఎక్కడుంచాలో అక్కడుంచుతా అంటాడు సుభాష్
ఇలాంటి మీతో కలసి ఉండాలని కోరుకోవడం లేదు..రేపే లాయర్ ని పిలిచి ఆస్తులు పంచిస్తా అంటాడు..రుద్రాణి, ధాన్యలక్ష్మీ, రాహుల్ సంతోషిస్తారు. తాతయ్య అలా ఉండే మీరెలా చేస్తారని రాజ్ అడిగితే..ఏం చేయలేం అనేస్తాడు సుభాష్.
నన్ను దాటి నా పెళ్లాం ఇవి చేయాలనుకుంటే..పచ్చని సంసారంల చిచ్చుపెట్టిన నిన్ను..ఉమ్మడి కుటుంబాన్ని బజారుకి ఈడ్చాలనుకున్న దీన్ని జైలుకి పంపిస్తాను. ఏంటి బెదిరిస్తున్నారా అని ఫైర్ అవుతుంది ధాన్యలక్ష్మి.. ఇద్దరూ గొడవపడుతుంటే ఆపండి అని అరుస్తాడు సుభాష్.
కావ్య వచ్చి ఆవేశంలో తీసుకునే నిర్ణయం మంచిదికాదని మీకు తెలుసు..తాతయ్య కోలుకుని వస్తే ఇది తెలిసి తట్టుకోగలరా అని అడుగుతుంది. మీ నిర్ణయం సరైనది కాదు నలుగురిలో చెప్పి మిమ్మల్ని తక్కువ చేయలేను..అందుకే ఇలా వచ్చి చెబతున్నా అంటుంది కావ్య. నిర్ణయంలో మార్పులేదంటాడు సుభాష్
ఇల్లు ముక్కలవడం ఇష్టమా మీకు..ఆస్తులు పంచడం ఇష్టమా..ఎందుకు పట్టించుకోవడం లేదు..ఆస్తి పంపకాలు జరిగితే తాతయ్య ప్రాణాలు గాల్లో కలసిపోతాయి..తాతయ్య జ్ఞాపకాలతో అమ్మమ్మ ప్రాణాలు కూడా నిలవవు..మీరే ఏదైనా చేయండి అంటుంది. ఓ రకంగా డాడ్ తీసుకున్న నిర్ణయమే కరెక్ట్. కలసి ఉందామని ఏ ఒక్కరూ అనడం లేదంటాడు రాజ్.
బ్రహ్మముడి డిసెంబర్ 12 ఎపిసోడ్ లో.. లాయర్ ఎంట్రీ ఇచ్చి సీతారామయ్య రాసిన వీలునామా చదువుతాడు.ఆస్తి మొత్తం ఉమ్మడిగా ఉండాలని కోరుకుంటున్నా అని అందుకే కావ్య పేరుమీద పెట్టానని రాసి ఉంటుంది. రుద్రాణి, ధాన్యలక్ష్మికి పెద్ద షాకే ఇది.