Exit Poll 2024
(Source: Poll of Polls)
Brahmamudi Serial Today November 20th Highlights : కావ్యకు ఘోరం అవమానం.. రాజ్ అరాచకం బయటపెట్టేసిన సీతారామయ్య - బ్రహ్మముడి నవంబరు 21 ఎపిసోడ్ హైలెట్స్!
రాజ్ ఎలా గెలిచాడో అర్థమైనా కానీ..తన జీవితం ముగిసిపోయిందంటూ కావ్య బాధపడుతుంది..ఇంతలో రాజ్ వచ్చి ఆటపట్టిస్తాడు. ఆ తర్వాత రిజైన్ చేయిస్తాడు. ఫ్యూచర్లో ఏదైనా అవసరం ఉంటే ఏ కంపెనీలో అయినా రికమెండ్ చేయిస్తాను అంటాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఉద్యోగులు అందర్నీ పిలిచి కావ్యని అవమానించి...ఉద్యోగులను బెదిరించి మరీ సెండాఫ్ ఇప్పిస్తాడు రాజ్.
భారంగా బయటకు వెళ్లిపోతుంది కావ్య. ఆ తర్వాత బిల్డప్ ఇస్త CEO చైర్ల కూర్చుంటాడు రాజ్. కావాలనే శ్రుతిని టార్గెట్ చేస్తాడు. కావ్య పేరు తీసి డస్ట్ బిన్ లో పడేస్తాడు.
రైటర్ దగ్గరకు వెళ్లిన కళ్యాన్ పాటతీసుకుని...నీలాంటివాడికి నాలాంటి వాళ్ల దీవెనలు అవసరం అంటారు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి అమ్మపాట గురించి గొప్పగా పొడుగుతాడు. పాటకు లక్ష తీసుకుని ..కళ్యాన్ కి మాత్రం 10 వేలు ఇస్తాడు. పోనీలే నా పాటలు అందరకీ నచ్చుతున్నాయి అదే చాలు అనుకుంటాడు
కావ్య గెలుస్తుందని ధీమాతో కనకం ఆమె లగేజ్ మొత్తం సర్దేస్తుంది. నువ్వేం కూతురిని మొదటిసారి అత్తారింటికి పంపించడం లేదుకదా ఎందుకీ హడావుడి అని భర్త అన్నాకానీ పట్టించుకోదు.
ఇంతలో అక్కడకు వచ్చిన కావ్య నేను ఎప్పటికీ కనకం-కృష్ణమూర్తి కూతురినే ఆ ఇంటికి వెళ్లడం లేదు..నేను పోటీలో ఓడిపోయానని చెప్పి వాళ్లకి షాక్ ఇస్తుంది. కూతురి బాధ చూసి కృష్ణమూర్తి కనకం ఇద్దరు బాధపడతారు. నా కూతురు ఓడిపోయిందా ఇది నమ్మలేకపోతున్నా అనుకుంటుంది కనకం
మరొకవైపు అపర్ణ.. అబ్బాయ్ ఓడిపోయి గెలిచి ఇంటికొచ్చే కోడలికి హారతి సిద్ధం చేస్తున్నా అంటుంది. ఏ క్షణమైనా ఫోన్ రావొచ్చంటుంది స్వప్న. ఇంట్లో అందరూ కావ్య కోసం ఎదురుచూస్తారు. రుద్రాణి నోటికి పనిచెబుతుంది. కాపురాలు కూల్చే నీకు కాపురాలు నిలబెట్టే గురించి అర్థంకాదులే అత్తా అంటుంది స్వప్న
ఇంతలో రాజ్ సింగిల్ గా ఎంట్రీ ఇస్తాడు. నా కోడలు వచ్చేసినట్టుంది అంటూ హారతి తీసుకెళుతుంది.. ఇంటికెళ్లిన రాజ్ నేనే గెలిచాను.. కళావతి పూర్తిగా పుట్టింట్లోనే ఉండిపోతుందంటాడు...
బ్రహ్మముడి నవంబరు 22 ఎపిసోడ్ లో...ఇదీ ఓ గెలుపేనా నువ్వు నా మనవడివి అని చెప్పుకునేందుకు సిగ్గుపడుతున్నా..కావ్య డిజైన్లు దాచేసి వాటిని తనే వేసినట్టు క్లైయింట్ కి చూపించి పందెంలో గెలిచాడని సీతారామయ్య అసలు విషయం చెబుతాడు... ఇప్పటికైనా నీ భార్యను ఇంటికి తీసుకురా అంటుంది ఇందిరాదేవి...