Brahmamudi Serial Today November 19th Highlights : డిజైన్లు తస్కరించడమే కాదు కళావతిపై రాజ్ మరో కుట్ర - బ్రహ్మముడి నవంబరు 19 ఎపిసోడ్ హైలెట్స్!
కావ్య డిజైన్స్ కొట్టేసేందుకు కావ్య క్యాబిన్ కి వెళతాడు రాజ్. ఇంతలో కావ్య హ్యాండ్ బ్యాగ్ కోసం రావడంతో రాజ్ బెంచ్ కింద దాక్కుంటాడు. ఇక్కడకు ఎవరో వచ్చారని కావ్య అంటే..రాజ్ సర్ వచ్చి ఉంటారని శ్రుతి అంటుంది..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాజ్ గురించి కావ్య గొప్పగా మాట్లాడి వెళ్లిపోతుంది... ఆ తర్వాత రాజ్ ధీమాగా కూర్చుని డిజైన్లు చూసి చాలా బావున్నాయ్ అనుకుంటాడు. ఇలాంటి డిజైన్లు తస్కరించడంలో తప్పులేదు అనుకుంటాడు
ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు.. ఇంతలో ధాన్యలక్ష్మి తనకోసం వేరుగా వంట చేసుకుని తెచ్చుకుంటుంది. మీరు ఆస్తి పంచి నా కొడుక్కి న్యాయం చేసేవరకూ ఇలానే ఉంటాను అంటుంది. సెపరేట్ వంటకి పాత్రలు సరిపోతాయో లేదో తెచ్చి ఇవ్వు అని సీతారామయ్య కొడుకు ప్రకాశంకి చెబుతాడు
ఇదేంటి నాన్న ఇలా మాట్లాడుతున్నారని రుద్రాణి అంటే.. నువ్వు ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టింది చాలు. ఇంకా ఎక్కువ చేస్తే నా నిర్ణయం నేను తీసుకోవాల్సి ఉంటుందంటుంది ఇందిరాదేవి. అర్థమైందా అత్తా అని స్వప్న సెటైర్ వేస్తుంది..రుద్రాణి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది
కావ్య దగ్గర నుంచి కొట్టేసిన డిజైన్లు కాపీ చేసి వేరేలా వేసి ఆ క్రెడిట్ కొట్టేయాలి అనుకుంటాడు. ఇంతలో సీతారామయ్య వచ్చి గెలుస్తావని చాలా నమ్మకంగా ఉన్నట్టున్నావ్ అంటాడు.
కళావతి వచ్చి డెమో ఇవ్వకుండా చేయబోతున్నానని తెలిస్తే తాతయ్య ఏమైపోతారో అనుకుంటాడు రాజ్. డ్రైవర్ కి కాల్ చేసి కళావతిని రేపు ఆఫీసుకి టైమ్ కి తీసుకురావొద్దని చెబుతాడు
కావ్య ఆఫీసుకి స్టార్ట్ అవుతుంది.. కనకం పూజ చేస్తుంటుంది. ఏంటి నాన్నా పొద్దున్నే అమ్మ పూజలు చేస్తోంది అంటే.. పందెంలో నువ్వు గెలవాలని అంటూ హారతి తీసుకొచ్చి ఇస్తుంది కనకం. కావ్య వినియోగించిన పెన్నులు, స్కెచ్చులు తీసుకొచ్చి ఆయుధపూజా చేశానంటుంది
ఆటో ఎక్కిన కావ్య స్టార్ట్ చేయి అంటుంది. ఇప్పుడు రాహుకాలం ఓ 20 నిముషాలు ఆగి స్టార్ట్ అవుదామా అంటాడు ఆటో డ్రైవర్. లేట్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాడు. కావ్య గట్టిగా చెప్పడంతో ఆటో స్టార్ట్ చేస్తాడు...
అపర్ణ టెన్షన్ పడుతుంటే ...ఎందుకు అని అడుగుతుంది ఇందిరాదేవి. రాజ్ చేతిలో కావ్య ఓడిపోతుందని అంటూ రుద్రాణి ఎంట్రీ ఇస్తుంది.. నీ నోట మంచి మాటలే రావా అని అపర్ణ అంటే అసలు మాటలే రాకుండా చేయమంటారా అంటుంది స్వప్న. ఎవరు గెలుస్తారో అని కంగారుగా ఉంది అంటుంది అపర్ణ...
బ్రహ్మముడి నవంబరు 20 ఎపిసోడ్ లో... రాజ్ ఆఫీసుకి స్టార్ట్ అవుతాడు.. పందెం పందెం అంతే..నేనే గెలుస్తాను.. ఆ కళావతి ఆఫీసులో, ఇంట్లో అడుగుపెట్టేందుకు వీల్లేదు అంటాడు. బ్లెస్ మీ మమ్మీ అంటే.. పిల్లా పాపలతో వర్థిల్లు అంటుంది అపర్ణ... రాజ్ ఫైర్ అవుతాడు