Brahmamudi February 13th Episode Highlights:ముసలాడే కానీ మహానుభావుడు.. అనామికా నీ పనైపోయిందిక - బ్రహ్మముడి ఫిబ్రవరి 13 ఎపిసోడ్ హైలెట్స్!

రుద్రాణి, దాన్యలక్ష్మీ.. రాజ్, కావ్యపై ఫైర్ అవుతుంటే సీతారామయ్య ఎంట్రీ ఇస్తాడు. నా పరువు మర్యాదలు మీకు అక్కర్లేనప్పుడు మీరూ నాకు అవసరం లేదు..ఆస్తులు మొత్తం జప్తు చేయించి బ్యాంక్ వాళ్లకి కట్టేయ్..ఎవరు ఏమైపోయినా నాకు అనవసరం అని ఇచ్చిపడేస్తాడు
Download ABP Live App and Watch All Latest Videos
View In App
మీ వారసులు ఏమై పోయినా పర్వాలేదా అని ధాన్యం అనగానే..చాల్లే నోర్మూయ్ అని ఇందిరాదేవి ఫైర్ అవుతుంది. మీ మావయ్య పరువు మర్యాదలు మీకు అవసరం లేనప్పుడు మీరు మా వారసులు ఎందుకు అవుతారు.. ఈయన మాటకు ఎదురు చెప్పే అర్హత ఇక్కడ ఎవరికీ లేదు. తాతయ్య చెప్పింది చేయ్ అంటుంది ఇందిరాదేవి

ప్రాపర్టీ డాక్యుమెంట్స్ బ్యాంక్ లాకర్లో ఉన్నాయ్ రేపు హ్యాండోవర్ చేస్తామని రాజ్ చెప్తాడు. బ్యాంక్ వాళ్లు అయితే రేపు జప్తు చేస్తాం అంటారు. విసురుగా వెళ్లిపోతుంది రుద్రాణి.
ముసలాడే కానీ మహానుభావుడు అంటూ సీతారామయ్యపై మండిపడతారు రాహుల్-రుద్రాణి. మన పరిస్థితి ఏంటో అని బాధపడుతుంటారు. ఎంట్రీ ఇచ్చిన స్వప్న చిప్ప వాళ్ల దగ్గర పడేస్తుంది. కానీ మాకంత కర్మ పట్టలేదంటుంది రుద్రాణి.
ఇప్పుడు అలాగే అంటారు కానీ.. రేపు ఆస్థి పోయాక ఇద్దరు కలిసి రోడ్డు పడి అడుక్కుంటే చూసేందుకు ఎంత బావుంటుందో ఊహించుకోండి అంటుంది
జరిగినదంతా తలుచుకుని ప్రకాష్ బాధపడుతుంటే... అపర్ణ, సుభాష్, ఇందిరాదేవి ఓదార్చుతారు.
ఇంటికి పెద్ద దిక్కు అని కూడా చూడకుండా రుద్రాణి, చిన్నత్తయ్య అలా మాట్లాడడం నాకు ఆశ్చర్యంగా ఉంది. తాతాయ్య మనసుకి ఎంత కష్టం అనిపించిందో అని కావ్య బాధపడుతుంది. తాతయ్యని ఎలాగూ సంతోష పెట్టలేదు..ఆయన మాటను అయినా నిలబెడదాం అని బ్యాంక్ కి బయలుదేరుతాడు రాజ్
బ్యాంక్ వాళ్లు ఇల్లు జప్తు చేస్తారన్న ఆలోచనతో.. సీతారామయ్య ఇంటిని చూసుకుని బాధపడుతుంటే ఇందిరాదేవి ఓదార్చుతుంది.
అప్పుకి లంచ్ తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళతాడు కళ్యాణ్. అక్కడ లేడీ కానిస్టేబుల్ కళ్యాణ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతుంది.
బ్రహ్మముడి ఫిబ్రవరి 14 ఎపిసోడ్ లో... నందగోపాల్ బతికే ఉన్నాడన్న విషయం బయటపడుతుంది..దీంతో కథ మరో మలుపు తిరిగే అవకాశం ఉంది