Pawan Kalyan Temple Tour: అగస్త్య మహర్షితో మొదలు పెట్టి పరుశురామ సందర్శనతో ముగిసిన పవన్ కల్యాణ్ మొదటి రోజు యాత్ర

కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పుణ్య క్షేత్రాలు దర్శించుకోనున్న డిప్యూటీ సీఎం
Download ABP Live App and Watch All Latest Videos
View In App
మొదట కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు.

సాయంత్రానికి తిరువనంతపురంలోని తిరువల్లం శ్రీ పరుశురామ క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ టూర్లో పవన్ కల్యాణ్‌తోపాటు కుమారుడు అకీరా నందన్, టిటిడి బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు.
ఆలయాలకు వెళ్తున్న పవన్‌కు అర్చకులు, దేవస్థాన బోర్డ్ సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
ఆలయ సందర్శన పూర్తిగా వ్యక్తిగతమని పవన్ చెప్పారు.
సుమారు నాలుగున్నరేళ్ల క్రితం చెల్లించుకోవాల్సిన మొక్కుల్ని ఇప్పుడు తీర్చుకుంటున్నట్టు వెల్లడించారు.
ఈ వ్యక్తిగత ఆలయ సందర్శనను రాజకీయాలతో ముడిపెట్టొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు.
పవన్ కళ్యాణ్ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఆరవ అవతారమైన శ్రీ పరశురాముడికి పవన్ కళ్యాణ్ ప్రత్యేకపూజలు నిర్వహించారు.
ఆలయ ప్రధాన అర్చకులు కండన్ సోమహరిపాద్ పవన్ కళ్యాణ్ గోత్రనామాలతో పూజలు నిర్వహించి వేదాశీర్వచనం, తీర్ధప్రసాదాలు అందించారు.
పరశురాముడికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం పవన్ కళ్యాణ్ ఆలయంలో ఉన్న ఇతర దేవాలయాలు సందర్శించారు.
అక్కడ బ్రహ్మ, దుర్గాదేవి, సుబ్రహ్మణ్యస్వామి, మత్స్య మూర్తి, వేద వ్యాస, శివాలయం, శ్రీకృష్ణ ఆలయం, గణపతి ఆలయాలను దర్శించుకొని పూజలు నిర్వహించారు.
దేవాలయంలో భక్తులు చేస్తున్న భజన కార్యక్రమాన్ని ఆద్యంతం వీక్షిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
అనంతరం సమీపంలోని ఓ హోటల్‌కు చేరుకున్నారు.
అక్కడ పవన్ కల్యాణ్‌కు హోటల్ సిబ్బంది తమ సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేకంగా స్వాగతం పలికారు.