Brahmamudi February 11th Episode Highlights:సీతారామయ్య రీ ఎంట్రీ..ఆస్తుల జప్తుపై అనామికకు రివర్స్ షాక్ - బ్రహ్మముడి ఫిబ్రవరి 11 ఎపిసోడ్ హైలెట్స్!
రాజ్, కావ్య కలిసి వంద కోట్లు అప్పు చేసి...మీరు తినే తిండి, వాడే కార్లపై ఆంక్షలు పెట్టారంటూ మొత్తం బయటపెడుతుంది అనామిక. రుద్రాణి, ధాన్యలక్ష్మి రాద్దాంతం మొదలుపెడతారు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇక ఆపండి అని ఇందిరాదేవి ఫైర్ అవుతుంది. అది అబద్ధమే అయితే వాళ్లని నోరు విప్పమను అంటాడు రాహుల్. అనవసర ఖర్చులు తగ్గించాలని చేసే ప్రయత్నం అంటుంది ఇందిరాదేవి. ఇదిగో బ్యాంక్ వాళ్లు ఇచ్చిన నోటీస్ అని బయట పెడుతుంది అనామిక
మీరంతా రోడ్డున పడితే చూసేందుకు మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిపోతుంది. బినామీ పేర్లు మీద ఆస్తులు కొన్నారా? ఏం చేశారు అంటూ ధాన్యం, రుద్రాణి గొడవ చేస్తారు. అపర్ణ, సుభాష్ కూడా కావ్య రాజ్ ని నిలదీస్తారు. ఏదో బలమైన కారణం ఉందంటాడు కళ్యాణ్.
కావ్య నిజం చెప్పేందుకు ప్రయత్నిస్తుంది కానీ రాజ్ అడ్డుకుంటాడు. నా అనుమతి లేకుండా నువ్వేమీ చేయలేదు..సమాధానం నేనే చెప్పాలి అంటాడు. 25 కోట్లు తీర్చాం..ఇంకా 75 కోట్లు త్వరలో తీర్చబోతున్నాం. ఇంతకు మించి ఏం చెప్పినా మీరు వినే స్థితిలో లేరంటాడు రాజ్. అప్పులోంచి ఒక్క రూపాయి కూడా మా సొంతానికి వాడుకోలేదు అదొక్కటి మీరు నమ్మితే చాలు అంటూ కావ్యను అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు.
ఇదంతా అపర్ణ వదిన, అన్నయ్యకి తెలిసే ఉంటుందంటూ రుద్రాణి మరో ఫిటింగ్ పెడుతుంది. ఈ సమస్య ఎక్కడి నుంచి మొదలైందో తెలియకపోతే నా విశ్వరూపం చూస్తారంటుంది ధాన్యం.
ఇంటి పరువు తీసే మనిషి రాజ్ కాదు.. కావ్య డబ్బు మనిషి కాదు...ఎదో బలమైన కారణం ఉంది అందుకే వాళ్లు మౌనంగా ఉంటున్నారని బాధపడుతుంది అపర్ణ. ఇదే అవాకశంగా రుద్రాణి, ధాన్యలక్ష్మి చేసే గొడవను ఎలా ఆపాలా అని కంగారుపడతారు సుభాష్, అపర్ణ.
అనామికకు ఈ విషయం ఎలా తెలిసిందో అని ఆలోచనలో పడతారు రాజ్ కావ్య. తాతత్య గురించి బయటపడనందుకు సంతోషించాలి. ఇక ఈ వందకోట్లు అప్పు తీరేవరకూ ఎవరూ ఎలాంటి గొడవా చేయలేరు అంటాడు. కావ్య ఏదో చెప్పబోతుంటే..ఇన్నాళ్లూ నన్ను నమ్మావ్ కదా ఈ విషయంలో నన్ను నమ్ము అంటాడు
బ్యాంక్ వాళ్లతో మాట్లాడిన అనామిక.. దుగ్గిరాల వారి ఆస్తులు జప్తుచేయమంటుంది. ఈ విషయం సామంత్ కి చెబుతుంది. బ్యాంకు వాళ్ల దగ్గర నుంచి తక్కువ రేటుకు నీ పేరుమీద రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది అంటుంది. సామంత్ సంబరంలో ఉంటాడు
ఆస్తులు చేజారకముందే మన వాటా మనం తీసుకోవాలి అంటుంది ధాన్యం. ఇంత స్వార్థంగా ఎలా ఆలోచిస్తున్నావ్ అంటాడు కళ్యాణ్. ఏం ఈ విషయం మీకు ముందే తెలుసా అని ఫైర్ అవుతుంది.
బ్రహ్మముడి ఫిబ్రవరి 12 ఎపిసోడ్ లో...గడువు తేదీ ఉండగానే బ్యాంక్ వాళ్లు వచ్చి ఆస్తులు జప్తు చేస్తాం అంటారు. వాళ్లముందే రుద్రాణి, ధాన్యం రాజ్ కావ్యలతో వాదనకు దిగుతారు. తండ్రి ఇచ్చిన వందకోట్ల ష్యూరిటీ విషయం బయటపెడతాడు సుభాష్.. హాస్పిటల్ నుంచి డిశ్శార్జ్ అయి వస్తాడు సీతారామయ్య.