Brahmamudi Anamika : బ్రహ్మముడి అనామిక రీ ఎంట్రీ అదిరిపోయింది..రాగానే అప్పు చేతిలో ఔట్!

బ్రహ్మముడి సీరియల్ లో అనామికగా నటిస్తోన్న నిఖితా చౌదరి...చిన్న బ్రేక్ తీసుకుని రీఎంట్రీ ఇచ్చింది. వచ్చీ రావడంతోనే అప్పు-కళ్యాణ్ ని టార్గెట్ చేసి రివర్స్ లో చీవాట్లు తింది
Download ABP Live App and Watch All Latest Videos
View In App
జ్యుయెలరీ షాప్ ఓనర్ ని పెళ్లిచేసుకోబోతున్నా అని పొగరుగా మాట్లాడిన అనామికకు...త్వరలో నువ్వు రోడ్డున పడతావ్ బ్రదర్ అంటూ అనామికను పెళ్లిచేసుకోబోయే వ్యక్తికి షాక్ ఇచ్చింది అప్పు

నాతో ఉన్నప్పుడు మహారాజులా ఉండేవాడివి...ఇప్పుడు రోడ్డునపడ్డావని కళ్యాణ్ ని టార్గెట్ చేస్తుంది అనామిక. తాను రోడ్డున పడలేదని.. ప్రేమించిన అమ్మాయిని పెళ్లిచేసుకుని సంతోషంగా ఉన్నానని కళ్యాణ్ క్లారిటీ ఇస్తాడు...
బ్రహ్మముడి సీరియల్ కన్నా ముందు నిఖితా చౌదరి ఇంటికిదీపం ఇల్లాలు సీరియల్ లో నటించింది. ప్రస్తుతం బ్రహ్మముడి తో పాటూ జాబిల్లికోసం ఆకాశమల్లే సీరియల్స్ లోనూ స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులను మెప్పిస్తోంది
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిఖితా చౌదరి..తాను పనిచేసే టీమ్ తో కలసి రీల్స్ చేస్తూ రెగ్యులర్ గా పోస్ట్ చేస్తుంటుంది...