Brahmamudi Serial Today March 11th Episode Highlights : గతం మర్చిపోయిన రాజ్ కి కొత్త భార్య వచ్చింది.. రిషిధారలా రాజ్ కోసం కావ్య ఎదురుచూపు- బ్రహ్మముడి మార్చి 11ఎపిసోడ్ హైలెట్స్!
యాక్సిడెంట్ చేయించిన యామిని..రాజ్ ను సెపరేట్ గా ఎత్తుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది. గత మర్చిపోయిన రాజ్ పేరును రామ్ గా మార్చేసింది. తల్లిదండ్రులు నచ్చజెప్పినా అస్సలు పట్టించుకోదు..నా సంతోషం కోసం మీరు కూడా నాటకం ఆడాల్సిందే అంటుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాజ్ కోసం అపర్ణ, ఇందిరాదేవి కన్నీళ్లు పెట్టుకుంటారు.అందరం కలసి మరోసారి వెతుకుదాం అని ప్రకాశం అంటే.. బావ ఇక లేడు అని నిజం చెబుతుంది అప్పు. రాజ్ వస్తువులన్నీ కలెక్ట్ చేసిన కవర్ చూపిస్తుంది
ఆ వస్తువులు చూసి కుప్పకూలిపోతుంది కనకం. దేవుడు నా బిడ్డబతుకు అన్యాయం చేశాడంటూ ఏడుస్తుంది. కావ్యకు నిజం తెలిస్తే ప్రాణాలతో ఉండగలదా అని కుమిలిపోతుంది
దుగ్గిరాల కుటుంబం మొత్తం రాజ్ చనిపోయినట్టు నమ్మేశారని నిర్ధారించుకున్న ఓ వ్యక్తి యామిని దగ్గరకు వెళ్లి ఆ విషయం చెబుతాడు. కూతురు ఏం చేస్తోందో తెలియక తల్లిదండ్రులు తలపట్టుకుంటారు
ఇకపై రాజ్ లేడు..రామ్ ఉంటాడు. తను నా మావయ్య కొడుకు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు, మీరే పెంచారు..మా ఇద్దరికీ పెళ్లి చేద్దాం అనుకున్న టైమ్ లో యాక్సిడెంట్ జరిగి గతం మర్చిపోయాడు..ఇదే కథ అని గట్టిగా చెబుతుంది
నాకోసమే బతికావు బావా అంటూ ఎమోషనల్ అవుతుంది యామిని. నువ్వు ఎవరు అని అడిగితే కథ చెబుతుంది..తల్లిదండ్రులను కూడా పిలిచి పరిచయం చేస్తుంది..మీరంతా ఎవరో నాకు తెలియదని కోప్పడతాడు రాజ్. తన జీవితం, భార్య, కుటుంబం పరిస్థితి ఏంటని యామిని తండ్రి అడుగుతాడు కానీ ఎవరు ఏమైనా నాకు సంబంధం లేదు నాకు తను కావాలి అంటుంది యామిని.
యామిని తల్లిదండ్రులు..కనకం పక్కనే కూర్చుంటారు. తమకు కాబోయే అల్లుడు గతం మర్చిపోయాడు కానీ తననే పెళ్లిచేసుకుంటానని మా కూతురు అంటోందని చెబుతారు. అదే మంచిది అంటుంది కనకం. రాజ్ ను చూసేందుకు వెళుతుంది కానీ ఇంతలోనే అప్పు పిలవడంతో వెనుతిరుగుతుంది
స్పృహలోకి వచ్చిన కావ్య మీరంతా ఇక్కడున్నారేంటి నా భర్తని వెతికేందుకు వెళ్లలేదా అని కోప్పడుతుంది. ఎంత చెప్పినా నమ్మదు..రాజ్ బతికే ఉన్నాడని ఫిక్సైపోతుంది
బ్రహ్మముడి మార్చి 12 ఎపిసోడ్ లో...అందరకీ భోజనాలు వడ్డిస్తుంది కావ్య. ఎవ్వరూ తినేందుకు రారు. ఇదే అదనుగా రుద్రాణి తన బుద్ధి బయటపెడుతుంది. మరోవైపు రాజ్ భోజనం చేస్తుండగా పొలమారుతాడు..ఎవరో తల్చుకుంటున్నారని యామని తండ్రి అంటే తన భార్యే అయి ఉంటుందని అంటుంది యామిని తల్లి...