Bhanumathi Serial Today March 13th Episode 04 Highlights: తండ్రి కోసం భాను పార్థుతో పెళ్లి కి ఒప్పుకుంటుందా .. భువన ఏం చేయబోతోంది - భానుమతి మార్చి 13 ఎపిసోడ్ హైలెట్స్!
తండ్రి బుక్స్ అమ్మేసుకున్నాడని తెలిసి భానుమతి బాధపడుతుంది. మళ్లీ పుస్తకాలు కొనుక్కునేందుకు దాచుకున్న డబ్బులన్నీ తీసి లెక్కపెడుతుంది. అవి సరిపోకపోవడంతో తల్లి వంటలు చేసి సంపాదించిన మొత్తం ఇచ్చేస్తుంది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appభాను..బావా అన్న మాటను గుర్తుచేసుకుంటూ బావ పాటలు వింటూ మురిసిపోతుంటాడు పార్థు. భానుమతినే తల్చుకుంటూ ఉండిపోతాడు
ఇంతలో మరదలు భువన వచ్చి రేపు షాపింగ్ కి తీసుకెళ్లు అని అడుగుతుంది. కుదరదు అనడంతో నువ్వు ఓకే అనేవరకూ ఇక్కడే ఉంటా అంటుంది. తప్పక సరే అంటాడు పార్థు
దాచుకున్న డబ్బులతో బుక్స్ కొనుక్కునేందుకు వెళ్లి బయటకు వస్తున్న భానును..మళ్లీ సేమ్ గ్యాంగ్ చుట్టుముడుతుంది. భయంతో ఏం చేయాలో అర్థంకాక దిక్కులు చూస్తున్న భానుకి పార్థు కనిపిస్తాడు
బావా అని పిలిచి మళ్లీ పార్థుని పడేస్తుంది.. దగ్గరకు వెళ్లి పార్థుకి సారీ చెబుతుంది. వాళ్లు ఏడిపిస్తున్నారు అందుకే అలా చెప్పాను అంటుంది. పార్థు వచ్చిన వాళ్లకు వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు
పార్థుకి పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో జాతకం చూపిస్తుంది నాయనమ్మ. అంతా బాగానే ఉందని భవిష్యత్ బంగారంలా ఉంటుందని చెబుతాడు జ్యోతిష్యుడు.
మరోవైపు భానుమతి తండ్రి తాగుడు కోసం అప్పులు చేసి తీర్చకపోవడంతో వాళ్లంతా కట్టేసి కొడతారు. కుటుంబం మొత్తం వెళ్లి బతిమలాడడంతో ఓ నెల రోజులు గడువిస్తారు
తల్లి దగ్గర దీపం పెడుతున్న సవతి తల్లిపై ఫైర్ అవుతాడు పార్థు. మా నాన్నకు భార్యవు కావొచ్చు కానీ నాకు తల్లివి కావేవంటూ కోపంగా మాట్లాడుతాడు.. అన్ని విషయాల్లో మీ మాట వింటాను కానీ ఈ విషయంలో వినను అని తండ్రికి చెబుతాడు పార్థు