Bhanumathi 11th March Episode 02 Highlights: పెళ్లికాకముందే భానుమతికి సవతి ఫిక్స్.. బావా అంటూ పార్థుని పడేసిన భాను - మార్చి 11 ఎపిసోడ్ హైలెట్స్!
భానుమతి సెకెండ్ ఎపిసోడ్ హైలెట్స్ లో ...పార్థు-భానుమతి పెళ్లికాకముందే సవతి తయారైంది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతండ్రిని మోసం చేసినా, అవమానించినా కానీ వాళ్లను వదిలేది లేదంటూ పార్థు ఒకడికి వార్నింగ్ ఇస్తాడు. పత్రాలు లేకుండా డబ్బు ఇచ్చినా మోసం చేశావంటూ కోపంతో పత్రాలపై సంతకం చేయిస్తాడు
ఇంటికి తిరిగివస్తుండగా..భానుమతి బస్సుకోసం పెరిగెడుతుంటుంది. అది గమనించిన పార్థు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో బస్సుకి అడ్డంగా జీప్ పెట్టి ఆపేస్తాడు..బస్సెక్కిన భాను థ్యాంక్స్ చెబుతుంది
ఇంటికి చేరుకున్న పార్థు..పత్రాలు తండ్రికి ఇచ్చి నిన్ను ఎవరు తక్కువచేసినా చూస్తూ ఊరుకోను అంటాడు. ఆ పత్రాలు తల్లికి ఇవ్వమని చెప్పినా కానీ పక్కనే పెట్టేసి వెళ్లిపోతాడు కానీ ఆమె చేతికి ఇవ్వడు
పార్థు పెళ్లిచూపుల హడావుడి నడుస్తుంటుంది...ఇంతలో పార్థు మేనత్త ఎంట్రీ ఇస్తుంది. నా మేనకోడలు ఏది అని పార్థు తండ్రి అడిగితే నచ్చజెప్పి తీసుకొస్తా అంటుంది
కాలేజీలో భానుమతిని కొందరు ఏడిపిస్తుంటే చూసిన పార్థు..వాళ్లకి తనకో హీరోని పరిచయం చేస్తాడు. తనను ఏడిపించిన వాడిని లాగిపెట్టి కొట్టి ఇప్పుడు హాయిగా ఉందంటుంది భాను
రౌడీలకు వార్నింగ్ ఇస్తూ మిమ్మల్ని కొట్టింది ఎవరో తెలుసా మా బావ అని చెప్పేసి బస్ ఎక్కేస్తుంది..షాక్ లో అక్కడే నిలబడి ఉండిపోతాడు పార్థు
మరోవైపు పార్థు మరదలు పార్థు ఫొటో ఫోన్లో చూస్తుంటుంది..అంటే ..భాను ప్రేమలో పార్థు...పార్థు ప్రేమలో మరదలు..అప్పుడే సవతి పోరు మొదలైందన్నమాట...