Anasuya Bharadwaj: తగ్గేదేలే.. మళ్లీ కోటు విప్పేసిన అనసూయ - ఈ సారి ఫొటోషూట్ కోసం, ఆ ఫొటోలు మీరూ చూసేయండి
ఇటీవల ఓ టీవీ షోలో అనసూయ భరద్వాజ్.. కోటు (జాకెట్) విప్పి బుల్లితెర ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. దీంతో చాలామంది ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. ఫ్యామిలీ షో అంటే ఇదేనా.. పిల్లలు, పెద్దలతో కలిసే టీవీ షోస్‌లో ఏంటీ అందాల ప్రదర్శన అంటూ మండిపడ్డారు. ఆ తర్వాత దాని సంగతి మరిచిపోయారు. అయితే, అనసూయ తాజాగా ఆ డ్రెస్‌తో దిగిన ఫొటో షూట్ పిక్స్‌ను ఇన్స్టాగ్రామ్ ద్వారా బయటపెట్టింది. - Anasuya Bharadwaj/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘జబర్దస్త్’తోపాటు పలు టీవీ షోస్‌తో మంచి పేరు సంపాదించిన అనసూయకు సినిమాల్లోనూ ఛాన్సులు పెరిగాయి. దాదాపు మూడేళ్లుగా ఆమె సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. దీంతో బుల్లితెరకు కూడా దూరమైంది. - Anasuya Bharadwaj/Instagram
తాజాగా స్టార్ మాలో ప్రారంభమైన ‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్స్’ గేమ్ షో ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. వస్తూనే.. తన కోటు విప్పి మరీ అందాలను ప్రదర్శించింది. దీంతో దారుణమైన విమర్శలు వచ్చాయి. - Anasuya Bharadwaj/Instagram
అయితే.. అనసూయపై అలాంటి విమర్శలు కొత్తకాదు. వెంటనే ఇచ్చిపడేస్తుంటుంది. తాజా వివాదంపై కూడా ఆమె అలాంటి స్టేట్మెంటే ఇచ్చింది. - Anasuya Bharadwaj/Instagram
తాజాగా అనసూయ ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి.. ఎన్ని ట్రోల్స్ వచ్చిన తగ్గేదేలే అంటే సంకేతాలు ఇచ్చింది. అయితే, అనసూయ మళ్లీ బుల్లితెరపైకి రావడాన్ని అభిమానులు స్వాగతిస్తున్నారు. - Anasuya Bharadwaj/Instagram
అనసూయ ‘పుష్ప - 2’లో కూడా నటించింది. ఈ మూవీ ఆగస్టులో విడుదల కావల్సి ఉంది. అయితే, అనుకోని కారణాల వల్ల డిసెంబరుకు వాయిదా పడింది. - Anasuya Bharadwaj/Instagram
గతంతో పోల్చితే అనసూయకు సినిమా ఛాన్సులు తగ్గాయని, అందుకే ఆమె మళ్లీ టీవీ షోస్ చేస్తుందని అంటున్నారు. త్వరలో ఆమె ‘జబర్దస్త్’ షోలోకి రీ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదని అంటున్నారు. - Anasuya Bharadwaj/Instagram
అయితే, అనసూయ ఉన్నప్పుడు.. ‘జబర్దస్త్’, ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ పేరుతో రెండు షోలు నడిచేవి. ఆమె వెళ్లిపోయిన తర్వాత ‘ఎక్స్ట్రా జబర్దస్త్’కు సరైన యాంకర్ లేకుండా పోయింది. - Anasuya Bharadwaj/Instagram
సీరియల్ నటి సౌమ్య ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ బాధ్యతలు తీసుకున్నా.. అనసూయ లేని లోటును భర్తీ చేయలేదు. ఆమె వెళ్లాక సిరి వచ్చింది. దీంతో రేటింగ్ మరింత పడిపోయినట్లు సమాచారం. అందుకే, ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ను రద్దు చేసి.. కేవలం ‘జబర్దస్త్’ను మాత్రమే ప్రసారం చేస్తున్నారని తెలిసింది. మరి అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ను మళ్లీ ప్రారంభిస్తారో లేదో చూడాలి. - Anasuya Bharadwaj/Instagram