CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ - ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు భేటీ అయ్యారు. ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సీఎంతో సమావేశమయ్యారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
సీఎంతో భేటీ అయిన వారిలో రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, నాగార్జున, వెంకటేశ్, సి.కల్యాణ్, నాగవంశీ, గోపీ అచంట, బీవీఎన్ ప్రసాద్, వంశీ పైడిపల్లి ఉన్నారు.

అలాగే, త్రివిక్రమ్ శ్రీనివాస్, నవీన్, రవిశంకర్, మురళీమోహన్, హరీశ్ శంకర్, కొరటాల శివ, వశిష్ట, సాయిరాజేశ్, బోయపాటి శ్రీను, కిరణ్ అబ్బవరం కూడా సీఎంతో భేటీ అయ్యారు.
నటుడు వెంకటేశ్ సీఎంకు పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం సినీ పరిశ్రమ సమస్యలపై టాలీవుడ్ పెద్దలు చర్చించారు.
అటు, ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హోంశాఖ సెక్రటరీ రవిగుప్తా, డీజీపీ జితేందర్, చిక్కడపల్లి ఏసీపీ, డీసీపీలు ఈ భేటీలో పాల్గొన్నారు.
సమావేశం ప్రారంభం సమయంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వీడియోను సీఎం రేవంత్ సినీ ప్రముఖుల ఎదుట ప్రదర్శించారు.
అనంతరం సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అనంతర పరిణామాలపై సీఎంతో టాలీవుడ్ పెద్దలు చర్చించారు. ఈ క్రమంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఈ కమిటీ పలు అంశాలపై అధ్యయనం చేయనుంది.
రానున్న రోజుల్లో ఇండస్ట్రీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, అదనపు షోల నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాలు, టికెట్ రేట్ల పెంపుపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. దీనికి అనుగుణంగా సర్కారు కార్యాచరణ చేపట్టనుంది.